పుట:Andhraveerulupar025958mbp.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వాడుకగానున్నది. ఈకధకును వేమారెడ్డినామమునకును గల సంబంధ మెంతవఱకు సత్యమో తెలుప వీలుకాకున్నది.

వేమారెడ్డి క్రీ.శ. 1320 మొదలు 1349 వఱకు రాజ్యము పాలించెను. చరిత్రవిదులు తలంచుచున్నారు. ప్రతాపరుద్ర చక్రవర్తి తురకరాజులతో బోరాడి స్వాతంత్ర్యము నిలుపుకొను సమయమున దేశము చాలవఱకు బరాధీనము కాసాగెను. అపుడు వేమారెడ్డి కొన్నిదుర్గముల లోబఱచికొని పాలింపదొడగెను. ఇంతలో గాకతీయరాజ్య మస్తమించుటతో వేమారెడ్డి మిగుల స్వతంత్రుడయ్యెను. పిదప వేమారెడ్డి ఆంధ్రదేశమును తురకల హస్తగతము గాకుండ గాపాడెను. తురకలు హరించిన దేవబ్రాహ్మణ వృత్తులు తిరుగసాధించి తానుస్వయముగా పూర్వగృహీతలకు ధారపోసి వైదికమతమును నిలువ బెట్టెను. ఓరుగల్లు మొదలుకొని కొండపల్లి వఱకుగల దేశమును వెలమవా రాక్రమించుకొనిరి. రాచవారు తిరుగబడి వెలమవారి స్వతంత్రమును బడగొట్ట యత్నించుచుండిరి. ఈ యంత:కలహములను గుర్తించి తురుష్కులు దండయాత్రలు గావించుచు ఓరుగల్లు ప్రాంతములను గొల్లగొట్టుటచూచి ధరణికోట ప్రాంతములందు దన ప్రతినిధులను నిలిపి విరోధులెవరును గృష్ణదాటి రాకుండను దేశమునందు నెట్టి యశాంతి పొడసూపనట్లు వేమారెడ్డి మిగుల జాగ్రత్తగా గట్టుబాటులు చేసెను. క్రమముగా రాచ