పుట:Andhraveerulupar025958mbp.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజులు, సేనానాయకులు స్వతంత్రసంస్థానములు స్థాపించిరి. అపుడు రాజప్రతినిధిగానుండి నూతనరాజ్యములు స్థాపించినవారిలో ప్రోలయరెడ్డి యొకడు. ఈయన తరువాత రాజ్యమునకు వచ్చి ఆంధ్రదేశమున నసమానకీర్తి గడించిన మహావీరుడే మనకధానాయకుడును శూరచూడామణియు నగు వేమారెడ్డి భూపాలుడు.

వేమారెడ్డి పూర్వులు సంపదలతో దులదూగుచు దుర్గములు కట్టుటకు ధనము నార్జించిన విషయము దెలుపు నొక చిత్రకధవాడుకలో నున్నది. కథయొక్క సత్యాసత్యము లెటులున్నను వినుట కుత్సాహకరముగా నుంటచే నిట నుదాహరించుచున్నారము. దొంతి అల్లాడరెడ్డి కవులూరిలోనుండి అతిధిపూజాతత్పరుడై ప్రఖ్యాతుడై యుండునపుడు ఆయన యింటికి అకాలమున నొక వైశ్యుడువచ్చెను. అల్లారెడ్డి అతిధిపూజా తత్పరుడుగాన ఆగతుడగు వైశ్యుని మిగుల నాదరించి ఆహారముచేసికొనుటకు వలయుపాత్రముల వస్తువుల నొసంగగా నావైశ్యుడు తనయొద్దనున్న పసరుబరిణెగల గుడ్డల మూటను చిలుకకొయ్యకు దగిలించి వంటపని మీదబోయెను. కొంతసేపటికి పసరు తొణికిపడుటచే గ్రిందనున్నయినుపములుకు లన్నియు బంగారయ్యెను. అల్లాడరెడ్డి చూచి మిగుల నాశ్చర్యమునొంది మూటలోనేమి గలదో చూడ బసరుండెను. దానిని ఏలోహముమీద బోసినను