పుట:Andhravedamulurigveda.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండితుఁడు, మాక్సుముల్లరు మొదలగు ప్రాచ్యప్రతీచ్య నవీనపండితులు తమతమ యర్ధములు భిన్నభిన్నములుగాఁ గొన్నివ్రాసిరి. వాటిని, మాస్వంతయభిప్రాయమును, చివరసంపుటమునందే ప్రకటింతుము.

ఋగ్వేదమున విభాగము రెండువిధములు, ఒకటి - పదిమండలములు, మండలములలో అంతభా౯గములు అనువాకములు, వాటిలో సూక్తములు, అందులో మంత్రములు, మంత్రమునకే ఋక్కనిపేరు.

రెండవది. అష్టకము లెనిమిది, అందధ్యాయములు, అందువర్గములు, వర్గము లనుపయోగములని వదలివేసితిమి.

ఋక్కు లకు వరుససంఖ్యనిచ్చితిమి.

( ) ఇందువ్రాసిన గ్రంథముమూలమున లేదనియు సందర్భానుసారము భాష్యకర్తలు సంధించినది యనియు తెలియనగును. మఱియు తాత్పర్యవివరణములునుగలవు. దం|| ఇది దండాన్వయమని తా. అం దీ తాత్పర్యమని యెఱుంగనగును.

పాఠకమహాశయులారా! నిత్యములైన ప్రకృతిచిత్రములు వేదమందుఁగలవు. వేదమనఁగా జ్ఞానము, అపౌరుషేయమును, పదముల ఆనుపూర్విఋషులు రచించినదికావచ్చును అందలి తాత్పర్యము మాత్రమనాది. కనుకనే యపౌరుషేయము. ప్రకృతిని బలురీతుల వర్ణించును. ఇందు గొన్నిగూఢార్ధములు కలవు. అశ్వ = సూర్యుఁడు, గో = మేఘములోని యుదకము, హవిస్సు = ఆవిరి, సోమరసము = పచ్చివస్తువులలోని రసము దేవ = సూర్యకిరణములు, ఆ రసమును అవి గ్రహించుట యజ్ఞము, ఈయర్ధములును నిరుక్తముననున్నవే. ఇట్టి యర్ధవిశేషములు, చివరసంపుట మందే చూపుదుము. ఇపుడే యేలచూపలేదంటే, ఒకయర్ధము సమగ్ర గ్రంథమునకుఁ దెలిసినతర్వాత నర్ధాన్తరము లాయాప్రకరణాది సామగ్రింబట్టి బుద్ధిమంతులకు విమర్శింప వీలుచిక్కునని.

వేదార్థముయొక్క యుపయోగము.

మంత్రముల యర్ధమును గుర్తించుచునే కర్మలాచరింపవలెను. అపుడే కర్మ ఫలము కలుగును. అని పూర్వులసిద్ధాన్తము. అందుకనే గీర్వాణభాషకు సంస్కృతార్థము భాష్యకర్తలు వ్రాసిరి - అప్పటికి సంస్కృతము కర్మలుచేయువారికెల్లను