పుట:Andhravedamulurigveda.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము.

ఋగ్వేదము, (శుక్ల - కృష్ణ) యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము నని నాల్గువేదములు. యజుర్వేదము వచనశైలి, తక్కినవి పద్యశైలిలో నున్నవి. ప్రతివేదము సంహిత, బ్రాహ్మణము, అని రెండువిధములు. అన్నిటిలోను బ్రాహ్మణములు వచనశైలులు. సంహితలలో దేవతాప్రార్థనలు, మఱికొన్ని ప్రకృతివైచిత్ర్య వర్ణనములుకలవు. సామవేదము గేయము, తక్కినవి పాఠ్యములు.

బ్రాహ్మణములలో యాగముల విధులు, నిషేధములునుగలవు. అధర్వవేదమున మానవుఁడు తాను ప్రపంచమునఁగోరెడు సమస్తమయిన కోర్కెలను నాధించు జపహోమాదులుగలవు. తదితర వేదములందు స్వర్గాదిపారలౌకికఫలములు విశేషించి కలవు. ఐహికములును గలవు. అందు వ్యవసాయము, గోరక్ష, శత్రువుల నెదిరించుట మొదలగు విషయములు పదేపదే వణిన్ంపఁబడినవి.

ప్రస్తుతము మేము తెనిఁగించినవి సంహితలుమాత్రమే, మున్ముందు బ్రాహ్మణములుగూడ దెలిగింతుము.

వేదము ప్రాచీనగీర్వాణభాషలోనున్నది. దాని భాష్యములు సంస్కృత భాషలోనున్నవి. నిరుక్తమను వేదపదనిఘంటువును యాస్కముని సంస్కృతభాషలోనే వ్రాసినాడు. దానింబట్టియే వ్యాఖ్యాతలు వేదమున కర్ధమువ్రాసినారు. ఉవ్వటుడు, మహీధరుఁడు, శ్రీ విద్యారణ్యస్వామియు భాష్యములు వ్రాసినారు. విద్యారణ్యభాష్యమే యన్నిటిలో విపులము. శుక్లయజుర్వేదమునకు మాత్రమే ఉవ్వటభాష్యము ననుసరించితిమి. తక్కిన యన్నిటియర్ధమునకు విద్యారణ్యభాష్యమునే అనుసరించినారము. అందు మాస్వంత యభిప్రాయములు రవ్వంతయును సూచింపనైనలేదు. ఆ యాస్కుఁడొక్కక్కపదమున కనేకార్ధములు వ్రాసినాఁడు. భాష్యకర్తలుకూడ దానింబట్టి "యద్వా అధవా" ఇత్యాదిగా ననేకములర్ధములు వ్రాసినారు. దానింబట్టి వారు వేదార్ధమిదేయని నిర్ణయింప శక్యముకానట్టు లూహింపవచ్చును. ఒకర్ధమునే నిర్ణయించితే వికల్పములు వ్రాసియుండరు. కావున బుద్ధిమంతులు ఇంకొక యర్ధమునుగూడఁ జెప్పవీలున్నది. దయానందసరస్వతి, తిలక్