పుట:Andhravedamulurigveda.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓం.

పరమాత్మనేనమ:

ఆంధ్రదేశమునకును, ఆంధ్రభాషకును, ఆంధ్రులకును, ఆంధ్రపరిచితులకును, స్వభాష, పరభాషలు, నేర్చినను, నేఱకున్నను, సర్వులకును, సర్వులలో లీనమైన సర్వేశ్వరునకును, సర్వజ్ఞానప్రబోధకరమగు యీ ఆంధ్రవేదములను భక్తిపురస్సరముగా సమర్పణ మొనర్చుచున్నాము.

ఋగ్వేదకృతి.

గుంటూరుజిల్లా బాపట్ల తాలూకా మంతెనవారిపాలెము కాపురస్థులును, అసహాయోద్యమ కాలమున గ్రామోద్యోగమును త్యజించి సత్యాగ్రహములో కఠినశిక్ష ననుభవించినవారును, తనతండ్రి బాపిరాజుగారి జ్ఞాపకార్ధము "ఋగ్వేద" ప్రచురణకై అయిదువే లర్పించుచున్న త్యాగ, దానశీలురగు శ్రీయుత మంతెన సుబ్బరాజుగారికి "ఋగ్వేదము" కృతి నిచ్చుచున్నాము.

మాలవీయాజీ మహ దాశీర్వచనము.

"వేదవేదాంగములను, ఉపనిషత్తులను ఆంధ్రభాషలోనికి అనువదించి ప్రకటించుటకు తాముచేయుకృషి ఎంతయు ఎన్నదగియున్నది. పరమేశ్వరుడు ఈ కార్యమునందు తమకు సాఫల్యము ప్రసాదించుగాక!"

భవదీయ,

(సం.) మదనమోహన మాలవీయ

25 - 4 - 40