పుట:Andhravedamulurigveda.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోనే విఘ్నితులై నట్లు వారిగ్రంథములు తెల్పుచున్నవి. గంజాంమండలమువాసు లొకరు పద్యరూపమున ఋగ్వేదము తెనిఁగించిరి. అంతకుముందే శ్రీ బసవాచార్యులవారి యాంధ్రగ్రంధమున ననేక శ్రుతుల యర్ధములు, వానిచర్చలును గలవు. ముఖ్యముగా వివిధమత సామరస్యమునకైన యేకేశ్వరారాధనమే యీ వేదమునఁ గలదు. కూలంకషముగాఁ జూడక కొందఱు వేదములలో అనేక దేవతలు చెప్పఁబడినవి అని అన్నారు కాని యీ ఋగ్వేద ప్రధమ మండలము నూటయరువదినాల్గవసూక్తమున నలువదియాఱవ మంత్రమున - "ఏకంసద్వి ప్రాబహుధావదంతి = " వరుణ మిత్ర, వాయు, ఇత్యాది దేవతలంజెప్పి ఒకేవస్తువును విప్రులు పలువిధములుగాఁ బలుకుచున్నారు అని యున్నది. ఇట్టివనేకములు కలవు.

6. ఇంకొకటిచెప్పి ముగింతును. భూతభవిష్యత్తులంగూడ గోచరించుకొన్న మంత్రద్రష్టల పలుకులలోనుండి దేశకాల పరిస్థితుల గమనించిన బుద్ధిమంతులు, సంస్కృతమురానివారు, ఆంధ్రవేదముచదివి క్రొత్తవిశేషములంగూడఁ గనిపెట్టఁగలరు. కనుక మాయుద్యమము సాధిష్ఠము, సఫలము.

ఇట్లు,

బంకుపల్లె మల్లయ్యశాస్త్రి.

21 - 5 - 40