పుట:Andhrarastramu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రరాష్ట్రము.


1-వ ప్రకరణము.

జైనాశ్రమము.

“ఆంధ్రరాష్ట్రమున కింత విరోధముగఁ బని సేయువారుందురని నేను స్వప్నమం దైన సనుకొన లేదు.. ఈడూర్తవర్తనులకు శృంగభంగ మగు సుడిన మెన్నడోళడా? చిరకాలము నుండియు మాయాంధ్ర సామ్రాజ్యమునకుఁ బ్రబల శత్రువులై యున్న యీకుతంత్ర పరాయణులను జూచి పాపము దేవి దీర్ఘ విచారమున శుష్కించు చున్నది. వీరనారియు మహాపతివ్రతయు నగు నాసాధ్వీమణి 'పరిపాలనమునందుం డుట యీ మాండలిక రాజమండలమునకుఁ దలవంపు కలుగుచున్న దఁట! సామ్రాజ్య మున నంతఃకలహాగ్ని యుద్భవించుట కిదియే కదా ముఖ్య కారణము. ఈకలహాగ్ని రుధిరధారలతోఁ గాని చల్లారదు. తమదేశ క్షేమమును బ్రజా క్షేమమును లేశమును. బాటింపక యన్య దేశీయులగు దేవగిరియాదవుల కుట్రలలోఁ జేరిన పాండ్యచోళాది సామంతభూకాంతులు నిరంతర దురాలోచనాయ త్తచిత్తులై తమకొఱకుఁ దొమే గోతులు తవ్వుకొనుచున్నారు. ఈయంశర్నాటక "మెంతపఱకుఁ గొనసాగనో చూచెదఁగాక. ఈకపట నాటకమునకు సూత్రధారుఁడు జై నాచార్యుఁడు. పారి పౌర్శ్వకుఁడు ప్రతాపదేవుఁడు. కథానాయకుడు 'పాండ్యరాజు, ఆంధ్ర దేశచక్ర వర్తినియగు రుద్రమదేవి నీమువ్వురు హతకులును హృదయశూలములవలె బాధించు చున్న వారు. ఈదుష్ట శ్రయము నంత మొనర్చి ' దేశBC గల తాపత్రయమును దొలఁ గించి, సర్వేశ్వరుండు రక్షించుఁ గాక , ............ అందునకు సందేహ 'మేమి? అప్రయత్నముగ నాకు లభించిన యీయుత్తర మప్రతిహతముగ బ్రహాస్త్రము వంటివి కదా? మాయావియగు జై నాచార్యుఁడు పన్ను చుండిన కపట వ్యూహమును భేదించుట కింతకన్న ను క్తమసాధన మేమున్నది? అదిగో ! :ఆహవమల్లుఁడు : చెప్పిన జైనాశ్ర మోపాంత ప్రదేశ చిహ్నములు కా స్పంచు చున్నది. నిర్మల వాణిపూర మగు నీ కాసారమును, దత్తీరమునందేకల మహోన్న తమగు నీపటవృక్షమును, ఒండొంటితో నంటి కడుదట్టముగ వ్యాపించిన యీ కొండగుట్టలును, బాద మిడుటకైనఁ జోటీయక ,