Jump to content

పుట:Andhrapatrika samvatsaradi sanchika 1911.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రిగోదావరీమండలోనుపాధ్యాయసభ స్థాపించి ఎనిమిదేండ్లు కార్యదర్శిగనుండిరి. పెక్కూఅంధ్రపత్రికల కుపవిలేఖరుడై బోధకుల నుపకరించు శారదయను పత్రికను గొంతకాలము ప్రచురించిరి.

కామిశెట్టి పేరమ్మనాయుడుగారు.

గోదావరిజిల్లాలో ఫ్రెంచివారి పట్టణమగు యానాంపుర వాస్తవ్యుడు. ఇచ్చటా కీర్తివడసిన మహాజనులలో నీయనయొక్కడు. ఆపట్టణమునకు మేయరు (పురపాలనాధ్యక్షుడు)గ నుండెను. ఈయన దానధర్మములనుగూడ చేసినారు.

గ్రంధి రంగయ్యార్యులు.

ఈయన గుంటూరు కాపురస్థుడగు వైశ్యుడు. సంగీతవిద్యాపాండిత్యము గలవాడు. శృతిస్మృతి పరిచయుడు. సంస్కృతభాషాజ్ఞాని. ఆర్యవైశ్య సభా కార్యదర్శి.


విశాఖపట్టణము జిల్లాలోని జయపురాధీశ్వరుని పితృవ్యపుత్త్రుడు. సంస్కృతభాషయందు కొన్ని పుస్తకములను, ఓఢ్రభాష యందును ఆంధ్రభాషయందు కొన్ని నాటకములను వ్రాసెను. మాలతీ, కృష్ణార్జునుల చరిత్రములనునవి చెన్నపురి విశ్వవిద్యాలయ ప్రథమ పట్ట పరీక్షల కొకప్పుడు బఠనీయగ్రంథములుగా నిర్ణయింపబడెను.


న్యాయపతి వెంకటరామారావుగారు.

వీరు గంజాంజిల్లా టెక్కలి వాస్తవ్యులు. కృష్ణదేవుగు ఎస్టేటుకు మేనేజరుగ నున్నారు. ఆంధ్రమున కొన్ని పుస్తకములను వ్రాసినారు.


ఆంధ్రమున కొన్ని గ్రంథములను, నాటకములను రచించిరి.


ఈయన మహమ్మదీయుడు. వీరి కుటుంబమున ఆంధ్రభాషాజ్ఞానము పరంపర్యముగ వచ్చుచున్నది. ఈయన వయస్సు 25 సంవత్సరములకు మించదు. కవిత్వము ధారాప్రదముగా జెప్పగలరు. సీతాపతి పరిణయము, శారికాస్వయంవరము, మణిమాల, విచిత్రబిల్హణీయము, చంద్రగుప్త, ప్రహ్లాద, ఇత్యాది నాటకములను, ప్రబంధములను వ్రాసినాడు. కాపురస్థలము గోదావరి మండలములోని పిఠాపురము.


ఉత్తరసర్కారులలో నారాయణదాసుగారితో సమముగ హరికథలను చెప్పువారు వేరొకరుండరు. ఈయన ఆంధ్రగ్రంథకర్త. వీరిచే వ్రాయబడిన కొన్ని పుస్తకములు చెన్నపురి విశ్వవిద్యాలయ పరీక్షకు బఠనీయ గ్రంథములుగ నిర్ణయింపబడినవి.


యోగి శ్రీనివాసశాస్త్రిగారు.

(భారతీసమాజ పటములో వీరుగలరు.)

సంఘసంస్కరణము కొరకును, స్త్రీవిద్యాభివృద్ధి కొరకును వీరు చాల పరిశ్రమ చేయుచుందురు. యోగము చేసి చూపగలరు. ఈమధ్య రాజభక్తిని పురిగొల్పుచు కొన్ని యుపన్యాసముల నిచ్చియున్నారు.

గుమ్మలూరి లక్ష్మీనరసింహశర్మగారు.

ఈయన గానవిద్యానిపుణుడు. గుమ్మలూరి వేంకటశాస్త్రులు గారిపుత్రుడు. పదునొకండేండ్లనుండియు కవిత్వమును జెప్పు సామర్ధ్యమును గలిగియుండెను. గర్భచిత్రబంధ కవిత్వమునందును నేర్పుకలదు. నీతిదర్పణము, సావిత్రీచరిత్రము, జానకీపరిణయము ఇత్యాది పుస్తకములను వ్రాసినారు. కాపురస్థలము విజయనగరము.

ఈయన అతిబాల్యమునుండియు ననాయాసముగా గవిత్వమునుజెప్పు నేర్పును కలిగియుండిరి. ప్రాయము పదునెనిమిదేండ్లుండవచ్చును. ఘోషయాత్ర, ప్రభావతీపరిణయము, ప్రచండపాండవము ఇత్యాది నాటకములను, విమలాదేవి యను నవలను, కృష్ణకుమారియను ప్రబంధమును రచించినాడు.

బాలాంత్రపు రామచంద్ర సత్యనారాయణ.

ఈబాలకుడు పదునేను సంవత్సరములు మాత్రమే జీవించెను. ఈపిన్నవయస్సుననే రుక్మిణీకల్యాణము, ద్రౌపదీస్వయంవరము, శ్రీరామవిజయము అను చరిత్రములు గల గ్రంథములను వ్రాసెను. శైశవమున నింతటి మేధానిధియగు నీ బాలకుని జీవితము బలకులకెల్ల నాదర్శముగ నుండనోపును.

ఈయన అష్టావధానమును చేయగలరు. కృష్ణాజిల్లా అంగలూరు పురవాసి. ఇంగ్లీషునందు బ్రవేశపరీక్షలో గృతార్థులయినవారు. సంఘసంస్కరణాభిలాషి. ఆంధ్రభాషలో మంచిప్రవేశము గలదు. కొన్ని గ్రంథములను రచియించియున్నారు. కమ్మకులస్థులు.