దో వెంకటరమణాచార్యులుగారు.
వీరు విజయనగరము కళాశాలలో సంస్కృత పండితులు. ఈ సంచికకు "ఆత్మస్వరూపము" అను నొక వ్యాసమును వ్రాసినారు.
శీతారామ ఘనపాఠిగారు.
ఈయన వేదమును క్రిందినుండి పైవరకు చదువగల అత్యద్భుత మేధాసంపన్నుడు. గొప్ప గౌరవములను కీర్తిని బడసినాడు.
శ్రీమాన్ శ్రీపరవస్తు శ్రీనివాసభట్టరాచార్యులయ్యవార్లంగారు.
మదరాసు రాజధానిలో మిగుల ప్రసిద్ధిబడసిన శ్రీ పరవస్తు శ్రీనివాసవేంకటరంగాచార్యులువారికి భ్రాతృవ్యులు. వీరికి సంస్కృత, లాటిన్, హిబ్రూ భాషలలో విశేష పాండిత్యము కలదు. అగస్త్యాఖ్యానతత్వము, ఆదిత్యాఖ్యానతత్వము, కమలనీకలహసటీకకు వ్యాఖ్యానగ్రంథమును వ్రాసి పేరుపొందినారు. వీరు విశ్వావసు సంవత్సరములో స్వర్గస్థులయిరి.
మున్నంగి రామయ్యపంతులుగారు.
వీరు లింగధారిబ్రాహ్మణులు. 1844 సం॥ మచిలీపట్నములో జన్మించిరి. 1868 లో జిల్లాకోర్టులో నాజరుపనిలో బ్రవేశించి 1872 లో గుంటూరు డిస్ట్రక్టుకోర్టు మునసబుగ నియమింపబడిరి. పిమ్మట బందరు, బెజవాడ, నరసాపురము, తణుకు, బరంపురము, బాపట్ల, కాకినాడ మొదలగుచోట్లను 1904 వరకు డిస్ట్రక్టు మునసబుగా నుండి సత్కీర్తినిగాంచి ఉపవేతనమునుబొంది స్వస్థలమును జేరిరి. 1882 లో వల్లూరు జమీందారుగారికిని రయితులకును కలతలేర్పడి నపుడు వీరు వ్యవస్థాపకులుగ నియమింపబడిరి. తమసామర్థ్యముచే నాకలతల నంతరింపజేసిరి. రామయ్యపంతులుగా రాశ్రితకోటి కుపకారము జేయుచు లింగధారులలో బ్రసిద్ధినిగాంచిరి. ఆంధ్రపత్రికాధిపతియును విద్యార్థిదశలో వీరి సహాయమును బొందెను. వీరి వ్యవహారకౌశలమునకు మెచ్చుకొని మండలన్యాయాధీశులనేకులు వీరికి ప్రశంసాపత్రముల నొసంగిరి. 1907 లో పంతులుగారు కీర్తిశేషులైరి.
కే. వి. ఎల్. నరసింహంగారు.
ఈయన ఎం.ఏ.; ఎల్. ఎల్. బి; బారిష్టరు పరీక్షలలో గడతేరినాడు. బి. ఏ. పరీక్షలో దెనుగునందు రాజధానికి మొత్తమున ప్రధమమున ధన్యత గాంచెను. ప్రస్తుతము చెన్నపురి హైకోర్టులో న్యాయవాదిగనున్నాడు
దుగ్గిరాల సూర్యప్రకాశరావుగారు.
వీరు బి. ఏ. పరీక్షలో లబ్ధవిజయు లయినవారు. కాకినాడలోని గోదావరి కలెక్టరు కార్యస్థామందొక యుద్రోగిగనున్నారు. ఆంధ్రభాషా వార్తాపత్రికల యభివృద్ధికి గోరుచున్నారు. హిందూస్థానములోని వివిధరాష్ట్రములును జూచివచ్చినవారు. సంఘసంస్కరణాభిమానులు. నిమ్నజాత్యుద్ధరణమును గురించియొక వ్యాసమీ సంచికకు వ్రాసినారు.
కనకపల్లి భాస్కరరావు బి.ఏ. గారు.
ఈయన బి. ఏ. పరీక్షలో దెనుగుశాఖయందు చెన్నరాజధానికి ప్రధమస్థానమున కృతార్థులయినవారు. ఈ సంచికకొక వ్యాసమును వ్రాసినారు. ప్రఫుల్లముఖి మొదలగు గ్రంథములను రచించిరి.
వేదుల కామశాస్త్రిగారు.
యం. బుచ్చికామకవిగారు.
ఆకొండి వ్యాసమూర్తిశాస్త్రిగారు.
పురాణకొండ మల్లయ్యశాస్త్రిగారు.
ఈయన చాలకాలమునుండి పాఠశాలా ప్రధానోపాధ్యాయుడుగానుండి యాంద్రమున గొన్ని గ్రంథములనుపద్యగద్యాత్మకముగా రచియించెను. మర్చెంటు ఆఫ్ చెనీస్ అను షేక్స్పియరు వ్రాసిన నాటకమును హృదయరంజకముగా దెలుగులోనికి భాషాంతరీకరణముజేసి