Jump to content

పుట:Andhrapatrika samvatsaradi sanchika 1911.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొవ్వూరు బసివిరెడ్డిగారు, ములుకుట్ల అచ్యుతరామయ్యగారు.

బసివిరెడ్డిగారు కృష్ణాజిల్లా నిడదవోలులోనుండు గొప్పవ్యాపారులు. రయిసుమిల్సుకు అధిపతి. దానధర్మములు చేయువాడు. అచ్యుతరామయ్యగారు న్యాయవాది. దానధర్మపరుడు.

ఎం. రామలింగారెడ్డిగారు.

ఈయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పట్టపరీక్షలో నుత్తీర్ణుడయినవాడు. దేశచరిత్రా పరీక్షలయందు బహుమానములను గడించిన విద్యార్థి. వేతనములను గడించినవాడు, తెలుగుభాషలో గొప్పపాండిత్యము కలదు. మైసూరురాజ్యములో విద్యాశాఖ యందిప్పుడొక యుద్యోగిగ నున్నాడు.

సి. వై. చింతామణిగారు.

ఈయన విజయనగరం కాపురస్తుడు. అలహాబాదులో నాంగ్లేయభాషలో బ్రచురింపబడుచున్న లీడర్ అను దైనికపత్రికకు సంపాదకుడుగనున్నాడు. "హిందూసంఘసంస్కరణమను" గ్రంథమునకు సంపాదకుడుగ నుండెను. ఇంగ్లీషుభాషయందు గొప్పపాండిత్యము కలదు. ఆంధ్రులలో ఆంగ్లేయ దైనికపత్రికకు సంపాదకుడుగా నుండునట్టి యదృష్టము మరియెవ్వరికిని లభించలేదు. చింతామణిగారు దేశభక్తులు. వ్యవసాయపరాయణులు. వీరికి మున్ముందు గొప్పగౌరవము లభించునని తలంపడుచున్నవి.

పి. కర్షాప్సుగారు.


శొంఠి రామమూర్తిగారు.


కూచి నరసింహము పంతులుగారు.


గిడుగు వేంకటరామమూర్తిగారు.


బుర్రా శేషగిరిరావుగారు.


అత్తిలి సూర్యనారాయణగారు.


ధర్మవరం కృష్ణమాచార్యులుగారు.


పాలెం గోపాలముగారు.


మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు.


కోలాచలం శ్రీనివాసరావుగారు.


మహామహోపాధ్యాయ తాతా సుబ్బరాయశాస్త్రిగారు.