పుట:Andhradathumala025862mbp.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ధాతుమాల.


ఈయాంధ్రధాతుమాలకు మూల మగువ్రాఁత కాగితపుఁ బ్రతి శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయమునఁ గల చిన్నయసూరిగారి లిఖతగ్రంథసముదయములో దొరకినది. ఇది చిన్నయసూరికృత మగునో కాదో సిద్దాంతము చేయుటకుఁ దగిన ప్రబలాధారములు దొరక లేదు. మేము విని నంత మట్టుకు సూరిగారిచే రచియింపఁబడిన వీక్రింది గ్రంథములై యున్నవి.

1. ఆంధ్రశబ్దశాసనము.
2. ఇంగ్లీషు లాచట్టముల భాషాంతరీకరణము
3. చాటుపద్యములు.
4. రాణిగారి మకుటాభిషేకమునకు రచించిన పద్యములు.
5. సంసృత బాలబోధ.
6. సంస్కృతసూత్రాంధ్ర వ్యాకరణము (చిన్నయసూరీయము).
7. ఆంధ్రశబ్దచింతామణి వ్యాఖ్య.
8. బాలవ్యాకరణము.
9. నీతిచంద్రిక.
10. శబ్దలక్షణ సంగ్రహము.
11. అక్షరగుచ్చము.
12. పద్యాంధ్రవ్యాకరణము.
13. విభక్తిబోధిని.
14. అకారాదినిఘంటువు.
15. విశ్వనిఘంటువు.
16. సుజనరంజనీపత్రిక.
17. ఆదిపర్వవచనము.
18. పచ్చయ్యప్పగారి పైఁబద్యములు.

ఈ గ్రంథమందు గ్రామ్యరూపములు పెక్కులు కానఁబడుచున్నవి. దీనినిబట్టి యిది చిన్నయసూరికృతము కాదేమో యని సంశయించుట కవకాశము గలదు. ఎట్లయినను దెనుఁగులో ధాతుపాఠ మింతదనుక లేదు. కావున దీనిని బ్రకటించితిమి. ఇందలిగుణదోషములు విచారించుభారము - పండితులదియై యున్నది.

దీనిపై విద్వాన్ కఱ్ఱి సాంబమూర్తి శాస్త్రిగారి యభిప్రాయము వెనుక వైపునఁ బ్రకటింపఁ బడినది.

ప. ఆ.