పుట:Andhra vaangmaya charitramu.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరిజూచి 4సాధు శైలినిమనముందు నిసర్గగానలహరీ వీచికలనద్దరినుండి యిద్దరికి దేలించుచున్నది. ఆంధ్రమహాశయులెల్లఱు అందలిహెచ్చరికను గమనింతురుగాక!"

కవికొండల వెంకటరావు బి, ఏ బి, ఎల్.

2.ఆంధ్రనాటకములు, రంగస్థలములు.

"శ్రీ టేకుమళ్ల అచ్యుతరావుపంతులు ఎమ్. ఎ, ఎల్ .టిగారు రచించినయీ 'ఆంధ్రనాటకములు' అను విమర్సగ్రంథమునందు నాటకముల ప్రయోజనములు పదార్శనవదతులును ఇప్పటి తెలుగునాటకముల గుణదోషములును విపులముగను వివేకముతోడను చర్చింపబడేనవి, నాటకములు వ్రాయువారును, నాటకములనాడు వారును,"నాటకము లనుచూచువారుగూడి ఈచిన్ని పుస్తక మును జదివి లాభమును పొంద గలరు. తెలుగునాటకములకు త్రోవజూపిన ఆంగ్ల సంస్కృతనాటకముల రీతులిందు ప్రాస్తావికముగ నుగ్గిడింపబడినవి..........."

విద్వాక్ గరిమళ్ల సోమన్న ఎమ, ఎ. ఎల్ , టి.

'............ఈ చిన్నగ్రంథము 'ఆంధ్రనాటకములు' అని పరిమిథార్ధకరామము ధరించినను లోనఁ బరిశీలింప . నాటకతత్వమునగ్రంధి స్థానముల ఛేదించు విమర్శగ్రంథమై “నాటకతత్త్వసారము" అను నామమునకుఁ వగియున్నది. ఇందు స్థూలముగా నాటక తత్వము, కథానిర్మాణము, పాత్రముల శీలప్రతిబష్టాపనము సుఖాంతదుఃఖాంతవీభాగవిచారము, ప్రదర్శన ఫక్కి యను నై దంశములు చర్చింపఁబడినను బ్రసంగవళముగా నేటికాలపు వివాదంశము లన్నీ యుఁ బరిష్కరింపఁబడినవి........”

మానవల్లి రామకృష్ణకవి, ఎమ్. ఎ.