పుట:Andhra bhasha charitramu part 1.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాపం చేసినా. గందుగోసంకి ఇప్పుడు మీకొడుకు అనిపించుకుంతనకు నాకుసిగ్గు అప్తది." మరలా తండ్రి నౌకర్‌గాల్లకు చప్యా కీ, "మంచిబట్టలు తండ్రి. ఇంక ఈడకి తొడగిపియుండ్రి. ఈడిచేతికి ఉంగ్రం పెట్టుండ్రి, ఇంక కాల్లకు పావసాలు తొడకుంతనకు ఇయుండ్రి, ఇంక మనము తిని చేసి ఆనందము చేస్తాము, కారణము ఈనా కొడుకు నచ్చి ఇండ్యా, ఆడు ఇపొద్దులేశి అచ్చిండు; ఆడు కారి పోఇండ్యా, గని ఇపొద్దునాకు దొర్కండు." మరలా ఆల్లు తా ఆనందము చెయ్య తలగిరి.

__________

దాసరీ భాష

ఒక్కోడొక్కోడ్ మనిసికె ఇద్దర్ మగపిలగాళు ఉండ్లి. వాళ్నోన చిన్నాపిలగడు తన తండ్రికె అనె. "తండ్రీ, నీ బడకల్నోన నాకె వచ్చ్యట్టి పాల నాకె ఈ". తండ్రివాళ్నోన తన బదక పంచిఇచ్చె. చిన్నాపిలగడు తన పాల తిస్కోని దూరము నాట్కపొయ్యి, శినా వద్దల్ ఆవలేదు, అంతట్ల్నో వాడు శన ఖర్చ శేశి తనబదకంతా పాడశేసె. వాడు ఇట్ల శేశిన మంట్కె ఆదేశమ్లోన పెద్ద్ కరవపడి వానికి ప్యాదర్కెం వచ్చె. వాడు ఆదేశంలోన ఒగ మనిశికి పక్క చాక్రి జేరే. ఈ మనిశి వాని పందలి మేపడన్కి తన చేనక తోలే. ఆడా ఆకల్గోని కళవళికుటి పంది తినేట పట్టు సుదా తినె కడపు నింపకుతుండె, ఆతె వాంకి యవళ్నించి ఏమీ చికకుండె. ఇట్ల తోడెం వద్దల్ పాయె; తన ఎనకటి జ్యలమం నెప్పయ్యి వాడు మన్‌సల్నోన అనె, "నాతండ్రి పక్క ఉండేట చాక్రిమంద్కి కడపు* నిండి ఎక్కొయిటంత ఇరిపెము చికతడి. ఆతె ఈడా నానూత్రన్కి ఆకల్గోని తప్తా, నా లేని నా తండ్రి తక్క పొయ్యిఅనె, "తండ్రీ నాద్యావర్ది కర్మం తండ్రీకర్మం కట్కోన్న్. నాను నీ పిలగడంటని అనిపిచకోగడ దాన్కి బాగలేదు. నన ఒగ చ్యాక్రీ మనిశి తిరశీ నీ పక్క్ పెట్టకో, "వాడు ఆనించి లేసి తన తండ్రికాడికి వష్తె వడు తండ్రి దూరంనించి వాని తూసి అంతకరణం పుట్టి ఉర్తపొయ్యి పటకోని ముద్దాడె. అప్పడ పిలగడు తండ్రికె అనె, "తండ్రీ న ద్యావరముందలా ముందలా తప్పశేస్న, నన నీ పిలగనంట్ పిలవకు. "దీన్కి తండ్రి తన --క్రీమండ్కి అనె, "మంచిది ఏశెంతెచ్చి నా పిలగన్కి తోడగుండి, ఏలుకోవ ఉంగరం ఏయిండి, కాళ్నోన్న చ్యప్పులు ఏయిండి, తినిపిచిదన్కి తయార