పుట:Andhra bhasha charitramu part 1.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యింక అక్కడా అవిచారముతో నడ్చి తన సంపత్తు పాడుగొట్టినాడు. తర్వాతా వాడు అంతా వొడ్శినంక ఆ దేశములో లావుకరువు బడది. అందుకు, వానికి కఠినము బడది; అప్పుడు వాడు దేశములో ఒక్కమనిషి దగ్గిర పోయి వున్నడు. వాడేతేసు వాని పందులు కాషేకొరకు తన చేండ్లోకి తోల్లాడు. అప్పుడు పందులు తినేది పట్టుతో వాడు తన పొట్ట నింపుకోవలె అని వానికి అనిపించింది, యింకా యెవ్వరు వానికి యివ్వలేదు. తర్వాతావాడు తెల్వి మీదికివచ్చి అన్నాడు; మాతండ్రి యింట్లో యెందరు నవుకరలకు పుష్కళంగా అన్నం వున్నది, యింకా నేను ఆకలితో చస్తా. నేను లేశి నా తండ్రి దిక్కుకు పొయ్యేను. వానితో అనెను, "ఓతండ్రి, నేను యీశ్వరుని విరుద్ధం నీముందర పాపం జేసినాను; యిక్కడినుంచి నీ కొడుకును అనేటందుకు నేను యోగ్యని కాను. నీ ఒక్క నౌకరివానివలె నన్ను వుంచు."

కామాఠీభాష.

వక్క మనశికి ఇద్దరు కొడుకులు ఉండుండ్రి. చిన్నోడు తండ్రికి అంటడు "అయ్యా, నా అంతుకు యేమి జిందగి అస్తది అది నాకు ఇయ్యానా." మరి తాను అది ఇద్దడ్కి పంచి ఇచ్చిండు. తోడ్యం దినాల్గు కాలే, ఇంతట్లా చిన్నకొడుకు తనది అంత హిస్స జమాచేసిదూరం దేశంకు యెల్లిపోఇండు. అడ అంత ముల్య మజాలా యగరకొట్టిండు. యప్పుడు అంత ముల్య యగర కొట్టిండు అప్పుడు ఆ ఊరల్యాకా పెద్దకాలం పడిండ్యా. అప్పుడు తనకు తిండికి మోతాదు ఆయా. మరలా ఆడు ఆ ఊరల్యా దండ్యోడు దగ్యరపోఇఅ ఉండ్యా. మరి ఆడు ఆడ్కి తన శేనులా పందులు మేపతనకు తోలిండు. పందులు తినేటి పొట్టు తిని పొట్టనింప తనకు తాను కబుల్ ఆయా గని అది బీయవ్వరు ఇయ్యరు. యప్పుడు ఆడు నుద్దిమిద అచ్ఛా. అప్పుడు మనసుల అనకుండ్యా," నా అయ్యా ఇంట్లా యంతమంది నౌకీర్‌చేశి సుకంగా పొట్టనింపుకుంతరు, ఇంకా నేను ఇడ ఉపాసం సస్తా. నేను ఇప్పుడు లేశి నాతండ్రి దగ్యర పోతా. ఇంక నేను ఆడ్కి అనేను, "అయ్యా, మీదీ వ దే వరుదీ అపరాధీ ఉన్నాను. దానికోసంకి మీకొడకు అనపించు కునతందుకు లాయక్‌కాను. నీవు నాకు నౌకరోడు మేరగా ఉంచు" అప్పుడు లేశి తండ్రి దగ్యర్కి పోయా. ఆడ్కి దూరంకెల్లి కొడకు రాంగా తండ్రి సూశా. ఇంక గోశావచ్చి తండ్రి ఉర్కి అల్ముకున్యా. ఇంక ఆడికి ముద్దిచుకున్యా. మరలా కొడుకు తండ్రికి చప్యా, "అయ్యా, నీ ముంగట నేను సామిది