పుట:Andhra bhasha charitramu part 1.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రదేశమునకు సంబంధించిన బౌద్ధమత గ్రంథమగు అట్ఠకథలోని భాషయునొక్కటియే యయియుండు టీయూహ కాథారము.

గ, గు, ప్రత్యయములు సంస్కృతములోని కప్రత్యయమునకు బ్రాకృతాభాషా వికారములని చెప్పుట కవకాశమున్నది. మాదిగ, గోసగి, మడంగి, కోణంగి, వడ్రంగి, మొదలగుశబ్దములలోని ప్రత్యయములు సంస్కృతములోని క, కి, ప్రత్యయ వికారములే. మధ్యపరగణాలలోని తేల్‌నదీ ప్రాంతమునుండి వచ్చినవారగుటచే తెలుగులను నామము కలిగినదని కొందఱు చెప్పుదురు. తైలికశబ్దభవము తెలుగని కొందఱి యభిప్రాయము. తెలివిగలవారు కావున తెలుగులను పేరు గలిగినదని కొందఱందురు. తెల్‌ అను పదము సంస్కృతములోని ధవల, తృప్త, దృప్త మొదలగు శబ్దముల ప్రాకృతవికారము కావచ్చును. ఈ వ్యుత్పత్తు లన్నియు నూహామాత్రములు. తెలుగుశబ్దము వ్యుత్పత్తినిగూర్చి ఇదమిత్థమని చెప్పుటకు నేటికిదగిన యాధారములు లభింపలేదని మాత్రముచెప్పి యింతటితో విరమింపవలసి యున్నది. ఈ విషయమై "జనపదేలుప్; తదశిష్యం సంజ్ఞాప్రమాణత్వాత్." " లుబ్యోగా-ప్రఖ్యానాత్" "యోగప్రమాణేచ తదభావే దర్శనంస్యాత్." "ప్రధాన ప్రత్యయార్థవచన మర్ధస్యాస్య ప్రమాణత్వాత్," అను పాణినీయ వచనములను స్మరింపవలసియున్నది.

తెనుగు భాషకు దమిళదేశము నందు వడుగ, బడగ, యను పేర్లున్నవి. పోర్చుగీసువారు తెనుగును బడగేస్ అని పిలుచుచుండిరి. జర్మనులు దానిని వరుగ యనిరి. ఐరోపియనులు తెనుగును జెంటూ భాషయని పిలుచుచుండిరి. ఈపదము పోర్చుగీసు శబ్దమగు జెంటియో, (అనగా మ్లేచ్చుడు, క్రైస్తవేతరుడు) అనుపదమునకు వికారము.

తెలుగునకు సంబంధించిన కొన్నివికార రూపములనుగూర్చి యింతకు ముందు దెలుపబడినది. వానికీ క్రింది యుదాహరణములు లింగ్విష్టిక్ సర్వే ఆఫ్ ఇండియా 4-వ సంపుటమునుండి తీసికొనబడినవి.

కోంటావుభాష.

ఒక మనిషికి యిద్దఱు పిల్లగాండ్లు వుండిరి. వాండ్లో చిన్నవాడు తండ్రితో అంటాడు, "తండ్రి, యేదో మాలమతది నాకు వచ్చెవలది అది యవ్వు." వెనకవాడు పిల్లనికి ధనము పంచి ఇచ్చిండు. వెనక కొన్ని దెవములకు చిన్నపిల్లడు అంత సొమ్ము జమాజేషి దూరదేశానకు పోయిండు