పుట:Andhra bhasha charitramu part 1.pdf/862

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యథేష్టముగ నొకపదము మఱియొకపదముతో సంబంధము గలిగియుండుట, ప్రత్యేకపదములకు బ్రత్యేకస్వరము, సంఖ్యావిశేషము (అనగా ప్రత్యేక పదములు తమతమ వచనములం దుండుట, వ్యక్తాభిధానము (అనగా ప్రత్యేకపదములు స్వతంత్రముగ బ్రత్యేకార్థములను గలిగియుండుట, ఉపసర్జనవిశేషణము, 'చ' యోగము, అనునవి యుండును. సమాసమున నివి యుండవు సమాసము ననేకపదము లున్నను నది యేకపదముగనే పరిగణింపబడును. సమాసమున జేరిన పదములన్నియు నొండొంటితో నతి సన్నిహితసంబంధము గలిగియుండుటచే నాసమాస మవిభాజ్యరూపమును బొందును. కావుననే కృత్తద్ధితములతోబాటు సమాసములను గూడ పాణిని ఒరాతిపదికములుగ బరిగణించి యున్నాడు.

ఒకపదము సమాసమునందు చేరిన తరువాత నా సమాసమునకు బహిర్గతమయిన మఱియొకపదముతో సాధారణముగ నన్వయింపదు. "ఋద్ధవ్య రాజమాతంగా:" అను నిట్టిప్రయోగము సాధువులు, కాని, వ్యవహారమున నీ నియమమునకు దప్పిన కొన్నిప్రయోగములను లాక్షణకు లంగీకరించి యున్నారు. "దేవదత్తస్య గురుకులమ్," "చైత్రస్య దా భార్యా" మొదలగు ప్రయోగములు గమకత్వశక్తిచె సాధువులని వారి యభిప్రాయము.

ఈ యభిప్రాయము ననుసరించియే కావలయు తెనుగుకవులు "తన ధర్మ విభవ సంతత సంస్తదామాది పరిపూర్ణులు" అను నిట్టి సమాసములలో 'తన' మొదలగు నాచ్ఛిక పదములను సంస్కృతసమాస మధ్యగతములగు పదములతో నన్వయింపజేసి ప్రయోగించియున్నాడు. ఇట్లు చేయగూడదని యహోబలుని తలంపు. పై సమాసమునందు 'ముప్తవామాది పరిపూర్ణులు' అనుటకు 'ముప్తవప్రీతిబరిపూర్ణులు' ---------------------నాడు. ఈ సవరణవలన