పుట:Andhra bhasha charitramu part 1.pdf/860

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(ఆ) కేవల హిందూస్థానీపదములు.

హుజూరు సిరాస్తాదారు, హైదరాబాదు, కలందాసు మొదలయినవి.

(ii) వేర్వేరు అన్యదేశ్యములు చేరినవి.

(అ) ఆంగ్ల హిందూస్థానీపదములు చేరినవి.

హెడ్‌మునిషీ, హెడ్‌గుమస్తా, డిప్టితహస్సీల్‌దారు, పుల్‌ఆరమ్‌కమీజు, హాఫ్ - ఆరమ్‌చొక్కా, కలక్టరుకచేరీ, గవర్నరుదర్జా, పోలీసుజవాను, వుయిలునామా, మొదలయినవి.

(ఆ) హిందూస్థానీ, ఆంగ్ల పదములు చేరినవి.

హుజూరుమేజిస్ట్రేటు, బేడ్రెన్సు, సఫేదుపౌడరు, మొదలయినవి.

iii. అన్యదేశ్యములును సంస్కృతపదములును గలిసినవి.

(అ) ఆంగ్ల సంస్కృతపదములు కలిసినవి.

యూనివెర్సిటీపరీక్ష, కాలేజీభవనము, హెడ్‌పండితుడు, గ్రామోఫోను సంగీతము, ఎలక్ట్రిక్‌దీపము, మొదలయినవి.

(ఆ) సంస్కృతాంగ్లపదములు కలిసినవి.

ప్రథమవోటర్ల లిస్టు, దక్షిణ మహరాటారైల్వే, ఉత్తరఅమెరికా, దక్షిణఆఫ్రికా, అమృతాంజనడిఫొ, ఆంధ్రపత్రికా ఆఫీసు, ఆనందా ప్రెన్సు, వెంకటేశ్వర్ అండు కో, మొదలయినవి.

(ఇ) హిందూస్థానీ, సంస్కృతపదములు చేరినవి.

హిందూస్థానీభాష, బేమర్యాద, జరూరుకార్యము, మున్సబుద్యోగము, ఘరానామనుష్యుడు, జనానాస్త్రీలు, నానా వజీర సేనా మానభేదనుడు, మొదలయినవి.

(ఈ) సంస్కృత, హిందూస్థానీపదములు చేరినవి.

కేవల హిందూస్థానీపదములు, అతిజరూరు, పండితదర్జా, మంత్రి హోదా, మొదలయినవి.

iv. అన్యదేశ్యములును ఆచ్ఛికపదములును గలిసినవి.

(అ) ఆంగ్లాచ్ఛికపదములు చేరినవి.

హార్మోనియంపెట్టె, రేడియోపాట, కలెక్టరు దొరవారు, లోయర్ - సెకెండరీ తరగతి, హొటేలుతిండి, గార్డుబండి, పాప్లినుగుడ్డ, మొదలయినవి.