పుట:Andhra bhasha charitramu part 1.pdf/859

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందచందములు, అన్నెపున్నెములు, ఉత్తరపత్తరములు, ఒచ్చెపొచ్చెములు, చుట్టపక్కములు, లంచపంచములు.

(3) బహువచన లు వర్ణము లోపించుట: నీరునిప్పులు.

బహువచన లు వర్ణము లోపింపగా మిగిలిన రూపముపై బరుషములు చేరినయెడల నేడు గ స డ ద వాదేశము కానరాదు; పూర్వకాలమున గలుగుచుండెడిదేమీ. ఉదా. కత్తికటారులు.

కొన్నిజంటలను సాధారణ ద్వంద్వసమాసములు గూర్ప వీలులేదు; అప్పుడాజంటలలోని పదముల తుది దీర్ఘములకు హ్రస్వముగాని, ము, లు వర్ణములకు లోపముగాని కలుగదు. ఉదా. అద్దాబద్దా, అనలూకొనలూ 'అనలుకొనలు' అని సమాసము కావచ్చును; కాని, 'అనకొనలు' అని కాదు; ఊళ్లూపూళ్లూ; ఏళ్లూపూళ్లూ; కన్నూకాలూ, కబురూకాకరకాయా, కారాలూ మిరియాలూ, చీమలూగామలూ, తొక్కాతోలూ.

ఒకప్పుడు పూర్వపదము తుది దీర్ఘము నిలిచి రెండవపదము తుది దీర్ఘమునకు మాఱుగ బహువచన లు వర్ణము నిలుచును: అడ్డాదిడ్డాలు, రొక్కా పక్కములు, క కాపికలు, అప్పా చెల్లెండ్రు మొదలయినవి.

ఒకప్పు డిట్టిసమాసములందలి యుత్తరపదము తొలిపరుషములకు గ స డ ద వ లాదేశము లగును: అన్నాదమ్ములు, అక్కాసెల్లెండ్రు.

మఱల మిశ్రసమాసము.

ఇంతకుబూర్వము (చూ. పుట. 749) మిశ్రసమాసములనుగూర్చి ముచ్చటించియుంటిమి. అచట సంస్కృతాచ్ఛికపదముల కలయిక మాత్రము వివరింపబడినది. ఇట్టి సమాసములేక (i) కేవలాన్యదేశీయ సమాసములు (ii) అన్యదేశ్యపదములును సంస్కృత పదములును గలిసిన సమాసములు (iii) అన్యదేశ్యములును దేశ్యములును గలిసిన సమాసములుకూడ తెనుగున బ్రచారమున నున్నవి. ఇట్టివానిని గ్రంథములందు ప్రయత్నముతో బరిహరింప వీలుండనేమోకాని, వ్యవహారమున నవి యపరిహార్యములుగ నున్నవి. ఇచట నాయాతెగల సమాసములకు గొలదిగ నుదాహరణముల నిచ్చిన జాలును.

కేవలాన్యదేశ్యపదముల సమాసములు.

(అ) కేవలాంగ్ల పదములు.

రైల్వేస్టేషను, పోస్టాఫీసు, కాలేజీహాలు, మోటారుకారు, బాడీనిక్కరు, గ్రామోఫోనుప్లేటు, హైకోర్టు మొదలయినవి.