పుట:Andhra bhasha charitramu part 1.pdf/846

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(58); గాండీవధర (2), వివ్వచ్చు (57), ధనంజయ(56), విజయ(50), ఫల్గున(27), భీభత్సు (26), జిష్ణు(14), కపిధ్వజ(3), కపికేతన(1), శ్వేతవాహన(2), కృష్ణ(2), కఱ్ఱి(2), ఇంద్రావరజసఖ(1), అనున వన్నియన్నిసార్లు వచ్చినవి. వీనిలో సవ్యసాచి, గాండీవి, గాండీవధర, వివ్వచ్చు, భీభత్సు, జిష్ణు, కపిధ్వజ, కపికేతన, శ్వేతవాహన అను పదములు సందర్భోచితముగ సార్థకములగుచున్నవి. కావున 'కవ్వడి' అనునది తద్భవమే కాని తెనుగున నయిన బహువ్రీహిసమాసము కాదనియే తోచుచున్నది.

'కవ్వడి' పదము తద్భవమైనచో నది 'కపర్దిన్‌' శబ్దభవము కావలెను. ఈ పదమునకు 'కవడి, కవడ్డి, కవ్వడి' అనునవి ప్రాకృత రూపములు; ప్రాకృతమున వానికి 'జటాధారి, గవ్వ' అని యర్థము. 'కపర్దిన్‌' పదము సంస్కృతమున శివునకు రూఢివాచకముగను, జటాధారులకు సామాన్యవాచకముగను నున్నది. కపర్దమనగా కిరీటమనియు నర్థముగలదు; 'కపర్ది' యన గిరీటి కావచ్చును. ఇందుకు సంస్కృతమున బ్రయోగము మృగ్యము; కాని, ఋగ్వేదమున 'కపర్దిన్, శబ్దము 'కిరీటి' పదమునకు బర్యాయముగ వాడబడియున్నది. "అయం సోమ: కపర్దినే ఘృతం న్య పవతే మధు, ఆభక్షత్ కన్యాను న:" (ఋగ్వేదము VII. 67. 11.) దీనిలోని 'కపర్దినే' అను పదమునకు భాష్యమున 'కల్యాణ ముకుటవతే' అని యర్థము చెప్పబడినది. ఈ సంప్రదాయార్థము ననుసరించి 'కిరీటి' పదమునకు బర్యాయపదముగా 'కపర్ది' శబ్దభవమగు 'కవ్వడి' పదము తెనుగు భారతమున నుపయోగింప బడియుండును. కాని, 'కిరీటి' పదమునకు గ్రీడియను తద్భవముండనే యున్నది కావున 'కవ్వడి' పదము 'కపర్ది' భవముగనే అనగా 'కపర్దము' లేక 'జటాజూటము' కలవాడను నర్థముననే యుపయోగింపబడిన ట్లెంచుట యుక్తమని తోచుచున్నది.

అయినను భారతమున గాని మఱి యెచ్చటగాని యర్జునునకు కపర్దియను నామము కానరాదు. అంతమాత్రమున 'కవ్వడి' పదమునకు 'కపర్ది' భవత్వమును త్రోసివేయుటకు వీలులేదు. 'కవ్వడి' యనునది లక్షణార్థమున దొలుత నుపయోగింపబడి తరువాత రూడ్యర్థమున దెలుగుకవుల వాడుక యందు నెలకొన్నదని చెప్పవలెను. అర్జునుడును కపర్దము కలవాడే యనుట కాతని 'గుడాకేశ' నామము తెలుపుచున్నది. గుడాకేశు డనినను కపర్ది యనినను నర్థమొక్కటే. కపర్దాకారముగల కేశపాశమును జుట్టు కొనువారి కెల్లరకు కపర్ది, గుడాకేశనామములు చెల్లును. గుడాకేశపదము అర్జునునకు గృష్ణునికి శివునకుగూడ జెల్లుచున్నది. వారి కేశరచనలక్షణము ననుసరించి వారి కాపేరు కలిగినది. కిరీటధారులు కపర్దాకారముగ శిరోజములను జుట్టుకొన్ననే యా కిరీటములు స్థిరముగ నిలుచును. అర్జునుడు కిరీటికావున