పుట:Andhra bhasha charitramu part 1.pdf/845

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అర్జునుని పేళ్లలో అర్జునుడు, ఫాల్గునుడు, జిష్ణువు, కిరీటి, శ్వేతవాహనుడు, భీభత్సుడు, విజయుడు, కృష్ణుడు, సవ్యసాచి, ధనంజయుడు అను పేళ్లు విరాటపర్వమున నర్జును డుత్తరునకు తెలిపినవి. వీనినిగాక పార్థుడు, శక్రనందనుడు, గాండీవి, మధ్యమపాండవుడు, కపిధ్వజుడు, రాధాభేది, సుభద్రేశుడు, గుడాకేశుడు, బృహన్నల అను నర్జున నామములను జటాధరుడు తెలిపియున్నాడు. 'నర' అను పదముగూడ భారతమున నర్జునునికి వాడబడినది. తెనుగు భారమున క్రీడి, వివ్వచ్చు, కఱ్ఱి, కవ్వడి, అనుపేళ్లు కానవచ్చుచున్నవి. ఇందు 'క్రీడి' 'క్రీడిన్‌' భవమైన తత్సమపదము కాదు; కిరీటి = ప్రా. కిరీడి = తె. క్రీడి, అను నాచ్ఛికపదము; 'వివ్వచ్చు' భీభత్సు శబ్దభవము; 'కఱ్ఱి' కృష్ణ శబ్దభవము; ఈ మూడును తద్భవములు, అట్లే 'కవ్వడి' యను పదముకూడ తద్భవము కాకూడదా?

'కవ + వడి' = కవ్వడి, అని చెప్పి యది బహివ్రీహిసమాస మన్నచో ఇంద్రాత్మజ, ఇంద్రజ, ఇంద్రతనూజ, శక్రనందన,' పురందరసూతి అనురీతి నెన్ని సమాసములనైన జేయ వీలగునట్లు 'కవవడి' పదమునకు 'ఇరువడి, జంటవడి, జతవడి, జంటవేగిరి', మొదలగు పర్యాయపదములను గల్పింప వచ్చును. కాని, భారతకవు లట్టి సమాసములను గల్పింపలేదు; అర్జునునకు కవ్వడియను పేరు రూఢియైనట్లే భావించి ప్రయోగించిరి. ఇదిగాక యాంధ్ర భారతమున 'కవ్వడి' అను పదము ప్రయోగింపబడినపుడెల్ల 'కవవడితనము'నే సూచించుటకు ప్రయోగింపబడలేదు. 'కడగి ద్రుపదానుజుడు నెవ్వడి గవ్వడిసేసె నూఱువాడిశరములం, గడునలిగి వాని నన్నియు నడుమన తునియంగ సేసె నరుడస్త్రములన్‌' (ఆది. VI.85) అను పద్యమునందు కవవడి తనమే ప్రథానమైనచో, 'కవ్వడి, నర' శబ్దములు తాఱుమాఱైనవి. 'కవవడి తనమే' యిచట బ్రధానమైనచో 'ద్రుపదాత్మజుడు నెవ్వడి వరుసేసె నూఱువాడి శరములన్... వానిని.. తునియంగసేసె కవ్వడి యస్త్రములన్‌' అనినయెడల నౌచితి పోషింపబడియుండును. ఒకవేళ నర్జును పరాక్రమ ముద్దేశింపబడినప్పుడు 'కవ్వడి' అను పదము పడినను నట్టియెడల పార్థ, నర మొదలగు పదములును నుపయోగింపబడియుండుటచే 'కవ్వడి' పదము 'కవవడితనము'ను సూచించుటకే వాడబడినదని చెప్ప వీలులేదు. ఇదిగాక తెనుగు భారతమున గవ్వడిపద ముపయోగింపబడినచోట్ల సంస్కృత మూలమున 'కవవడితనము'ను సూచించు పదములు వాడబడియుండలేదు.

ఆంధ్ర భారతమున అర్జునుని పేళ్లలో అర్జున(437), పార్థ (209), పృథాతనయ (1), పృథాపుత్ర(1), నర (131), ఇంద్రుని కొడుకు నను నర్థమున(115), క్రీఈది(98), కవ్వడి (80), సవ్యసాచి(77), కిరీటి(60), గాంఢీవి