పుట:Andhra bhasha charitramu part 1.pdf/841

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లతో నేర్పఱుపబడిన సాధనము, అని శ. ర. కన్నడము: కిట్టి = చెవులను, ముక్కును, చేతులను రెండు కట్టెల నడుమనుంచి అదుమునట్టి హింస; అట్టి హింస కుపయోగించు కట్టెలు); గండ(?) దల (అఖండ = *అగండ = గండ; ఇట్లే 'గండదీపము' మొదలయినవి; 'గండ' అనగా 'పెద్ద' యని యర్థము కాదు), గడి(?)త్రాడు = రెండురెండు పశువులను ఒక్కొక్కకాలుచేర్చి లంకెవేసెడు పలుపు (కన్న. కడి = గట్టి, బలమైన, పెద్ద; ఇట్లే; 'గడిపోతు'); గొంతెమ(?)కోరిక = శ. ర. సాధ్యముకాని కోరిక; 'గొంతెమ' స్త్రీవాచక పదమా? 'గొంతెమ్మ' అను దేవత పురుటింటి నాశ్రయించియుండుననియు నది 'గొంతెమ పురుగు' రూపమునవచ్చి పురుటింటిలోని దీపము నార్పివేయుననియు నొక నమ్మకము గలదు. 'కొత్తెమ్మ, కొఱ్ఱెమ్మ' అని యిద్దఱు దేవతలు; వీరు పురుటింటి నాశ్రయించి యుందురు. పురుటి పదునొకండవదినమున వీరికి 'పులగము' నై వేద్యము పెట్టుదురు. ఈ 'కొత్తెమ్మ' యే 'గొంతెమ్మ' యా? అయిన నీ 'గొంతెమ్మ' కోరుసాధ్యముకాని కోరిక యేమి? 'గొంతెమ్మ' పాండురాజు భార్యయా? ఆమె కోరిన సాధ్యముకాని కోరిక యేమి? ఆలోచింపగా 'గొంతెమ' స్త్రీవాచకపదము కానట్లు తోచుచున్నది. తమిళ ములో 'కొత్తు' అనగా 'ఆకస్మికముగా మీదపడి ఒడిసిపట్టు, అని యర్థము; ఇది తెనుగున 'కొంతు, గొంతు' గా మాఱీ 'ఎమ, ఎమ్మ' అను కృదంత ప్రత్యయములను గొనినట్లు తోచుచున్నది. గొంతెనుకోరిక = అకస్మాత్తుగా మీదపడి ఒడిసిపట్టవలెనను కోరిక; గొంతెమపురుగు = అకస్మాత్తుగా దీపమును ఱెక్కలతో నార్పివేయు పురుగు; గొంతెమగోరు = ప్రసారణి అనునొకచెట్టు; ఇది తనమీద వ్రాలు కీటకాదుల చుట్టును ఆకులను అకస్మాత్తుగా ముడిచి వానిని భక్షించును; అడ(?)సాల (కన్న. అడికె = వంట; అడు = వండు); అల(?)వోక (కన్న. అలవు = అలపు; శ్రమము పోవుట); అలవాటు (అలవు = పరిశ్రమము + పాటు); అవద(?)గాకి ('అవద' కు వ్యుత్పత్తి తెలియదు; 'అవదశ' = దిక్కుమాలినతనము, అనుపదముతో సంబంధమున్నదా?); ఆన(?)వాలు = ఆఱగాచినపాలు ('ఆఱు' అను క్రియతో 'ఆన'కు సంబంధమున్నదా?); ఈరువాఱు = అసివాఱు ('అసివాఱు' వలె నిదియు నన్యదేశ్య పదము కావచ్చును; ఎట్ట(?)పోగు = దండు, సైన్యము, అని శ. ర> "హరునకు వెట్టజుట్టిన యమాలయవాటికజేరి యచ్చటన్, మరుడు తదీయశాసనమునన్ విరహిప్రకరంబునొంప దుష్కరగతి నెట్టపో గెసగ గైకొని వచ్చినరీతి వచ్చెగ్రొవ్విరి రవ దువ్వచాల్గొని దివిన్ మలయానిలవాతపోతముల్." చంద్ర. - కన్నడము: ఎట్టి = మూర్ఖుడు, తుంటరి, మొండివాడు; పై పద్యమున 'తుంటరులగుంపు' అను నర్థమే సరిపోవును; ఒర(?)గట్టు (ఒర = జర)