పుట:Andhra bhasha charitramu part 1.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17. యస యధా నంఝోన ఆచుదయస నాభాకా భాభవారయే యాద-నా పతాయనాయ నామచే దసమోసయా.

18. పరేవచాపి సుయధారప న ఝే అసంపయాసా భికిసు పెవ భాభవియే పేవమే.

19. భారేకసి యాహవంస ధానివసధారి నాసేయా భా యధాపవధం సాప.

20. వసధఏచ అభచాసి యిపయ.

21. ఖాయధన ఆయాపాంసవా.

పైశాసనములలోని యక్షరములన్నియు సుస్పష్టముగా నున్నను పంక్తు లొకదానిలోని కొకటి సంక్రమించి యుండుటచేతనొక పంక్తిలోని యక్షరములు మఱియొక పంక్తిలోనివిగా జదువ బడినదేమో యను సందేహము గలుగుచున్నది. కావున పై శాసనము నర్థమును వివరింపలేదు. పై శాసనముల కును నాసికయందలి శాసనములకును గల ముఖ్యభేదము భేధములు లకారములుగా మాఱుటయని గుర్తింపవచ్చును. ఈమార్పు పైశాచీ మాగధీభాషలకు ప్రత్యేకలక్షణముగా లాక్షణికులు చెప్పియున్నారు.

సంస్కృతములోని చాల నక్షరములు లోపించుటయు నేకపదమునందే యచ్చులు ప్రత్యేకముగ నెట్టి యాగమాక్షరములు లేకుండగను, సంధి కాకుండగను వ్రేలాడుచుండుటయు లాక్షిణికులు దెలిపిన మాహారాష్ట్ర్యాది ప్రాకృతములందు గానవచ్చును. కాని వ్యవహారమునం దాయచ్చులకు సంధి యగుటయో వాని మధ్యమున నాగమహల్లులుచెరి వానిని బాధించుటయో సంభవించెను ఇట్టిమార్పులుజరిగి, భాషలలో ర్థమాగది, జైనమాహారాష్ట్రి, జైనశౌరసేవి, పాలి, యనునవి ముఖ్యములు. వీనిలో ర్థమాగథి, జైనమాహారాష్ట్రి, జైనశౌరసేవి, యను భాషలయందు ---- మతగ్రంధములు విస్థారముగ వెలువడినవి. ప్రాచిభాషయందు బౌద్ధమతగ్రంథములు వెలసినవి వీనిలో గ్రంధస్థములైన భాష స్థిరమై, లక్షణబద్ధమై చాలవఱకు మాఱకుండ నిలిచి పోయినది. కాని వ్యవహారమునందలి భాషనానాటికవి మార్పునొందుచునె యుండెను. దక్షిణహిందూదేశమున నించుమించుగ క్రీ.శ. 6-వ శతాబ్దము వఱకును బ్రాకృతభాషలు తప్ప నితరభాషలు ప్రచారములో నుండినట్లు గానరాదు. తమిళభాష క్రీస్తునకు బూర్వమునుండియు బ్రచారములో నుండెడిదను నభిప్రాయము నేడు విడనాడబడుచున్నది. క్రీస్తుశకము 6,7 శతాబ్దములవఱకు ద్రావిడ భాషలలో సంవత్సరములు నిరూపింపబడిన శాసన