పుట:Andhra bhasha charitramu part 1.pdf/836

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iv. అవ్యయముపై: అటువంటి (రామాభ్యు. VII. 226); ఇటువంటీ (ప్రభులిం. I. పు. 10; ప్రభా. III. 57; కళా. VI. బ; ఉ. రా. V. పు. 85; విక్ర. VII. 181); ఎటువంటి (ప్రభులిం. II. పు. 88; కళా. III. 33; రామాభ్యు. VII. 102; వరాహ. II. 145; ఉ. రా. I. పు. 16; దశావ. పు.44).

'వంటి' 'అంటి'గా కూడ వ్యవహారమున మారినదో, 'అట్టి' 'అంటి' అను ననునాసికోచ్చారణము నొందగా 'వ'కారమాగమముగా వచ్చినదో తెలియదు. 'అంటి' గ్రంథములలోని కెక్కినది: మునుపంటిపురము = మునుపటివంటిపురము (పాంచా. పరి. IV. పు. 33).

లాగు, తరము, తోయము, పగిది మొదలగునవియు దెనుగున నివార్థములుగ వాడబడుచున్నవి: మహానాగంబులాగున (వరాహ. III. 52); మీతరమువారు (మను. IV. 108; పాండు. VI. 44); ఆతోయము (కాశీ. VI. 7;) ఈతోయము = ఈమాఱు; (కాశీ. VI. 29); ఈతోయము = ఈగుంపు, (కాశీ. VI. 35) - అను నర్థములు గూడ గలవు); పగిది (వరాహ. IV. 162) మొదలయినవి.

ఇవార్థముపై దిరుగ నివార్థకపదము గ్రంథములందు కాన్పించుచున్నది: నిలిపినభంగివోలె (కుమా. భా. II. 55); వచ్చువడువువోలె (కుమా. 64); చాడ్పునబోలె (కుమా. 259).

కొందఱు కవులకు గొన్నికొన్ని యివార్థకపదములపై నభిమానము మెండు. నన్నయకు 'విధంబున, పోలె, పోని' మొదలగున విష్టములు. తిక్కనకు 'పరునున' ఇష్టము.

వ్యవహారమున 'మోస్తరు' అనున దొకటి కలదు. అది కవులగ్రంథములలోని కెక్కలేదు. ఇక ముం దెక్కవచ్చును.

కొన్నియెడల నుపమానము లనేకము లగునపుడు ఇవార్థకశబ్దము తుది దానిపై మాత్రము చేరును: కమలషండంబు నాగలోకంబు దలిరు బాన్పు కల్సాంతమున జముబానసంబు నింటిలోపలబోలె (నిర్వ. IV); వీండ్రును వాండ్రునుబలె (పభా. I).

పోలె ప్రభృతులు క్రియాపదములమీదను కానంబడుచున్నవి; అట్టియెడ గ్రియాపదముపై సముచ్చయార్త్య్హకమగు 'ఉన్‌' కూడ చేరవచ్చును: శోకతప్తంబయిన తనహృదయంబు దడుపుచున్నదియుంబోలె (భార. ఆర. II); ధవు గూర్మి గొసరుచున్నవి వోలె. - ఒకప్పుడ సంపూర్ణక్రియల మీదను నవి కాన్పించును: పయటకొంగది మాన్పగ బోలె గాళ్లపై బ్రబ్బికొనన్ (కళా. VIII).