పుట:Andhra bhasha charitramu part 1.pdf/835

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iii. షష్ఠిపై: దానికింబలె (కళా. II. 19); కేసరిమీదికింబలె (రామాభ్యు. VII. 246); ఇల్లాలిబలె (వరాహ. I. 32).

iv. సముచ్చయముపై: విశేషంబులుంబలె (కళా. III. 9); దక్కినదింబలె (రామాభ్యు. V. 18k); కల్పవల్లియుంబలెన్ (రామాభ్యు. VI. 158.) పై యుదాహరణములవలన 'బలె' అనునది పరమగునపుడు నామ తచ్ఛబ్దార్థములకు ప్రథమయేకాక ద్వితీయా షష్ఠులుగూడ గలుగుననియు, అస్మదర్థప్రభృతులకు ప్రథమకూడ గలుగవచ్చుననియు దెలియనగును.

బోటి.

i. ద్వితీయపై: ననుబోటికి (పాండు. IV.68); మముబోంట్లు(ఉ. హరి. II. 11); మముబోంట్లకున్ (కళా. II. 71); నినుబోటి (కాశీ. III. 150); మిమ్ముబోటులు (ప్రభులిం. IV. పు. 32): మిముబోటులు (వరాహ. XI. 41; కళా. I. 187);

ii. షష్ఠిపై: మా బోటులకు (ప్రభులిం. I. పు. 9); మాబోంట్లు (వరాహ. XI. 116; కళా. I. 178); మనబోంట్లు (కాశీ. VI. 76); మీబోంట్లు (కళా. III. 61.)

8. వంటి.

i. ప్రథమపై: దేవరవంటి (వరాహ. I. 15; పాండు. II. 205); దిగ్గజమువంటివాని (" I. 32); నేడువంటి (వరాహ. II. 147); కార్చిచ్చు వంటి (వరాహ. V. 117); ఆకాశమువంటి నడుము (వరాహ. VI. 10); పూత పసిండివంటి (మను. III. 33); పొగడపూవంటి (మను. V. 98); సుడివంటి నాభి (ప్రభులిం. I. పు. 8); పుండువంటి చలి (పాండు. II. 29); నూబూవువంటి నాసిక (హరవి. III. 23).

ii. షష్ఠిపై: నావంటి (శకుం. పరి. II. పు. 43); ననువంటి (వరాహ. VII. 90); మనవంటి (ఉ. రా. పు. 33); మావంటి (మను. I. 65; వరాహ. I. 114); మమువంటి (సమీ. III. 16); నీవంటి (వరాహ X. 2); మీవంటి (వరాహ. III. 101; 108; V. 40; మను. I. 65; ప్రభులిం. I. పు. 3); అతనివంటి (సమీ. VI. 25); తనవంటి (వరాహ. IX. 17); పులులవంటి (వరాహ. III. 23); క్రొమ్మెఱుగులవంటి (వరాహ. IV. 156); మెఱుగుల వంటి (వరాహ. VI. 52).

iii. ద్వితీయపై: నినువంటి (సమీ. II. 6); నిన్నువంటి (సమీ. II. 4; వరాహ. VI. 32); మిమువంటి (ఉ. రా. I. 11); మిమ్మువంటి (ఉ. రా. V. పు. 91).