పుట:Andhra bhasha charitramu part 1.pdf/833

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


షష్ఠీతత్పురుషసమాసమందు ప్రాచీనగ్రంధముల నగాగము వైకల్పికముగా జేరుట కలదు: ఉదా. ఎలజవ్వనంబున విలసనంబు. ఈ కార్యము సప్తమీతత్పురుషమందును గొన్నియెడల గాంపించుచున్నది: వారణావతంబున వారు; విశ(శా)ఖపట్టణమున కోమటి (శాసనము).

బిరుదపద ముత్తరపదముగా నిలిచినపుడు స్త్రీ పుం సంజ్ఞావాచకా దుదంతపదముల తుది యచ్చునకు దీర్ఘము బహుళముగా నగును: రామాశాస్త్రి, హనుమానాయుడు, గుండూరావు. 'కొన్నియెడల నిచ్చో న నా పా మా యాగమంబులగు' నని ప్రౌడవ్యాకరణకారు డనెనుగాని, నట్టియెడల 'అన్న, అప్ప, అమ్మ, అయ్య' అను పదములందలి ద్విత్వ వికల్పమువలన గలిగిన 'అన, అప, అమ, అయ' అను రూపములుగాని యవి యాగమాక్షరములు కావు: తిక్కన సోమయాజి, నన్నపార్యుడు, కృష్ణమనాయుడు, నన్నయభట్టు. 'పై యాగమంబులు కొన్నియెడల ద్విత్వ యుక్తంబులగు' నను వచనముచేతనే పై యూహ దృడమగుచున్నది.

ధాతుజ విశేషణములమీద తధార్థకావ్యయము చేరి కర్మధారయ సమాసమగును: భూసురోత్తరముల్ వేదముల్ సదువునట్లు; కడుం బెద్ద దవ్వుపోయినయట్లు మొదలయినవి.

తథార్థకములకును, నివార్థకములకును దెనుగున భేదము కాన్పింపదు. 'అట్టు' నకు 'అట్టి'యు, 'పోలెన్‌'కు 'పోని', 'పోటి' అనునవియు, 'వలెన్‌'కు వంటియు విశేషణరూపములు. ఇవార్థకపదముల ప్రయోగవైచిత్రి యీ క్రింద చూపబడుచున్నవి. ఇవి పూర్వపదములతో జేరి కర్మధారయసమాసము లగుచున్నవి.

1. అట్లు.

ఉపమేయము ప్రథమాంతమగునపుడు 'అట్లు' పరమైనచో నుపమానములగు నామ తదస్మద్యుష్మదాత్మార్థములకు షష్ఠియగును: నారాయణునట్లు, వానియట్లు, నాయట్లు, నీయట్లు, తనయట్లు మొదలయినవి.

2. అట్టి.

అట్టి, యిట్టి, యెట్టి విశేషణములమీది తచ్ఛబ్ద వకారమునకు లోపము విభాషనగు: అట్టిడు, అట్టివాడు; ఇట్టిడు, ఇట్టివాడు; ఎట్టిడు, ఎట్టివాడు.

3. పోని.

భారతమున 'క్రొమ్మెఱుంగునుంబోని' అనునట్లు సముచ్చయమగు 'ఉన్‌' పై 'బోని' చేరుచుండును. 'పోని' అనునది ధాతుజవిశేషణము; 'పోలిన' అనుదానికి రూపాంతరము. 'క్రొమ్మెఱుగుంబోని' అనునట్టి సముచ్చయ