పుట:Andhra bhasha charitramu part 1.pdf/830

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వంద్వసమాసముల కనేక ప్రయోగములు కాన్పించుచున్నవి. 'వెన్న మీగడయున్ ఫలంబొసగెదన్ (కవిచిం.); రోళ్లా రోకండ్లబాడ (వరాహ. VII. 22); రాకాపోకకావించె (చంపూ.) అన్నాదమ్ములగని (హరి ఉ. IV. 15); తల్లీ తామరయునుబోలి (హరి. V. 200);చల్లాయంబలి ద్రావితిన్ (శ్రీనాథ వీథి.) మొదలయినవి.

అలరువిలుతుడు, వేయిగంటి, వేడివెలుగు, చలివెలుగు, ముక్కంటి, నలువ, ఇత్యాదులు, బహువ్రీహిసమాసములు. 'కఱకంఠుడు' అనునది మిశ్రబహువ్రీహిసమాసము. 'కఱకంఠ' మొదలగునవియు హితములే యని యధర్వణోక్తి మొదలగునవి యనుటచేత దినవెచ్చము మొదలగునవి గ్రహింపబడుచున్నవి. త్రినేత్రుడు, పీతాంబరుడు అను సమాసార్థము ననుసరించి 'మూడుకన్నులవాడు, పీతాంబరమువాడు, పట్టుపుట్టముదొర మొదలగునవి అభాసబహువ్రీహు లగుచున్నవి. స్త్రీత్వమునం దివి మూడుకన్నులయది, పట్టుపుట్టమునది మొదలగునవియు నాభాసబహువ్రీహులే. ప్రథమాది ప్రయోగము వలన నాభాసబహువ్రీహి యగునని యధర్వణుడు; ఇచట ప్రథమాంతమనగా తచ్ఛబ్దార్థకపదములును నితరశబ్దములును గ్రహింపబడును. 'వేడివెలుగు' మొదలగు వానియందును షష్ఠ్యర్థ వివక్షచేత బ్రథమాంత ప్రయోగము సాధువేయగును. కావున 'వేడివెలుగువాడు' అనియు ననవచ్చును. 'కన్నులుమూడుగలవాడు' అనునది యాభాస కర్మధారయసమాసము. 'మెఱుగుబోడి' మొదలయినవి ఉపమానగర్భ బహువ్రీహులు. (బహువ్రీహిని స్త్రీవాచ్యంబగుచో నుపమానంబు మీది మేనునకుబోడి యగునని చిన్నయసూర్యాదులనిరి. ఇట్లనుట వైయాకరణ సరణి. కాని, యిందు 'మేను' శబ్దప్రసక్తి యున్నట్లు కాన్పింప 'పోని = పోలిన' అను ధాతుజ విశేషణముపై 'స్త్రీ' వాచక తచ్ఛబ్దార్థక పదమగు 'అది' లోని, 'ది'వర్ణముచేరి 'పోనిది' అను రూపమేర్పడి, 'ని'మీది యిత్వము లోపించి 'ద'కారమునకు 'డ'కారము కలిగినది. మెఱుగుంబోని యది = మెఱుగుంబోనిది = మెఱుగుబోడి, ఇత్యాది రూపములు సిద్ధించుచున్నవి.) 'చౌదంతి' ఇది మిశ్రసమాసము; ప్రాకృతమునుండి వచ్చిన సిద్ధసమాసము. 'చతు:' అనునది ప్రాకృతమున 'చఉ = చౌ' అని యయినది; 'దంతి' అను దానియందు మార్పు కలుగలేదు. 'కర్మధారయసమాసముకంటె మతుప్ప్రత్యయము కలుగదనువిధి నిత్యముకాదు, కావున 'చౌదంతి' మొదలగు రూపములు సాధువులే.

కేలుదమ్మి, మోముదామర, కైచిగురు, మోవిపండు, అడుగుజివురు, మైదీగ, చెక్కుటద్దము, కన్నుగలువ, కానుమిన్ను - ఇట్టివి ఉపమానసమాస