పుట:Andhra bhasha charitramu part 1.pdf/826

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ఇ' వర్ణము చేరును; అనగా నల్లి, తెల్లి, ఎఱ్ఱి, వచ్చి మొదలగు రూపములు గలుగవు. 'చిన్న' అనుపదమును నవీనముగ నల్లాదులలో జేరుచున్నది: చిన్నని, 'తెల్ల, వెల్ల, పుల్ల, చిన్న' ల తుది ద్విత్వమునం దొకహల్లు లోపించి వానిపై ని వర్ణముచేరును: తెలిదీవి, వెలిగౌరు, పులినీరు, చిని కృష్ణుడు. ఇట్టి విశేషము లింకను గలవు. వీనియందెల్ల సమాసమున దొలి పదముపై జేరునది 'ని' వర్ణము కాదనియు, 'ఇ' వర్ణమేయనియు గ్రహింపవలెను.

(47) ఆ, ఈ, ఏ, పెందల, తల అనువానిపై 'కడ' అను పదము చేరునపుడు దాని తొలిహల్లునకు లోపము కలుగును: ఆడ, ఈడ, ఏడ, పెందలాడ, తలాడ. ఇట్లు పరపదాదిహల్లు సమాసములందు లోపించుట మఱికొన్నిచోట్లను కాన్పించుచున్నది.

(48) 'ద్వంద్వంబున ఋకారంబునకు ర వర్ణంబు విభాషనగు' నని చిన్నయసూరి 'ద్వంద్వేగైర్వాణికే దీర్ఘాత్పరతోపి వికల్పత:' అను కారికను బట్టి నిర్వచించెను. ఈ కార్య మన్ని ఋకారాంత పదములమీదను గలుగునా యను సందేహము కలుగకపోదు. 'ఆనజ్ ఋతోద్వంద్వే' అను పాణిని సూత్రముప్రకారము 'మాతృ + పితృ' అను పదములు 'మాతా పితరౌ' అను ద్వంద్వసమాసముగ నేర్పడును. ఇట్టి ఆనజ్ ఆదేశము కలుగుటకు సమాసమందలి రెండు పదములును ఋదంతములుగ నుండవలెను: కావుననే 'పితృ పితామహులు' అని యగునుగాని 'పితా పితామహులు' అని కాదు. ఇట్టిచోట 'పిత్ర పితామహులు' అను రూపము కలుగదు. 'మాతర పితరావుదీచామ్‌' అను సూత్రమున బాణిని ప్రత్యేకముగ నీ మాతృ, పితృ పదముల సమాసమునకుమాత్రము 'మాతర పిత(రు)లు' అను రూపవిశేషణము సుదీచ్యులమతము ననుసరించి తెలిపియున్నాడు. ఈ 'మాతరపిత(రు)లు' అను దానిని మాత్రము కొందఱు తెనుగుకవులు మనస్సునం దుంచుకొని 'మాత్రపితలు' అని ప్రయోగించియుందురు. పై యధర్వణకారిక ననుసరించి మాత్ర పుత్త్రులు, పిత్రపుత్త్రులు, హోత్రపోతలు మొదలగు సమాసములను గల్పింపరాదు. "క్షత్త్రియవంశ్యులై ధరణిగావగ బుట్టినవారు బ్రాహ్మణ, క్షత్రియ వైశ్యశూద్రులనగా గల నాలుగుజాతులన్ స్వచారిత్రము తప్పకుండగ బరీక్షీతు కాచినయట్లు రామ మాం, ధాతృరఘుక్షితీశులు ముదంబునగాచిరె యే యుగంబులన్‌' (భార. ఆది. II.) అను పద్యమునందు 'మాంథాతృ' అని పాఠాంతరమును గొందఱు కల్పించుట పొరపాటు. 'త్త్ర', 'త్ర' 'తృ' లకు దెనుగున బ్రాసము