పుట:Andhra bhasha charitramu part 1.pdf/824

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తుమ్ము = క్షుతము; దిమ్ము = *ధృతమ్; నెమ్ము = నిర్హిమము; మమ్ము = ? ; ఱొమ్ము = ఉరము; వమ్ము = వ్యర్థము = పై. వయ్యము.

'కుమ్ము' లోని 'మ్ము' నకు '౦ప' అని యొకప్పు డాదేశము కలుగుచుండెనేమో. చూ. కుంపటి = కుమ్మునకు సంబంధించినది; అట్లే 'ఱొమ్ము' నందు గూడ. చూ. ఱొంప = ఱొమ్మునకు సంబంధించినది.

(iii) కనుమ్వాదులు: అనుము, ఇనుము, ఉడుము, ఎనుము, కనుము, గినుము, జనుము, మినుము, మొరము; అనుపచేను, ఇనుపకడ్డి, ఉడుపతోలు, ఎనుపపాలు, కనుపగడ్డి, గినుపపనులు, జనుపనార, మినుపవడ, మొరపనేల (మొరపవాన పెల్లుగురిసె, భార. ద్రో. III).

చిడుము, చిలుము, తుడుము, పిఱుము, పెనము, పొడుము, పొతము, మునుము, మెఱము, మెఱుము, నగము - వీని ము వర్ణమునకు ప వర్ణ మాదేశముకాదు.

  • 'గొనమ' అను 'మ' కారాంతపదమునకు 'గొనప' అను రూపాంతరము గలదు. ఇందు 'మ' కారమునకు 'ప' కారము పై రీతిగనే కలిగి యారూపమే వ్యస్తముగ బ్రథమావిభక్తియందు నిలిచియుండవచ్చును. పదముల యౌపవిభక్తిరూపములు కొన్ని - ప్రథమావిభక్తియందు నిలుచుట కుదాహరణము లున్నవి: చూ. పాలు, పాడి.

(42) "అకారంబున కామ్రేడితంబునకుం దదర్థకంబునకు అయి, ఆయి, అనుశబ్దములు విభాషనగును." 'ఆ + ఆ + కాలము' అనుచో ఆయాకాలము, అయ్యాకాలము, ఆయక్కాలము, అయ్యకాలము, ఆయయికాలము, అయ్యయికాలము, ఆయాయికాలము, అయ్యాయికాలము; 'అయి' కి 'ఐ' కలిగి 'ఆయైకాలము, అయ్యైకాలము', అనికూడ నగును.

(43) సంబంధార్థమున దచ్ఛబ్దములగు వాడు, అది, (అమహద్వాచకము) అనుపదము లన్నిశబ్దములమీదను నుత్తర పదముగా జేరి సమాసమగును: "నావాడు, నాయది; ఇంటివాడు, ఇంటియది; రామునివాడు, రామునియది." ఇట్టి సమాసములందు 'అది' యనుదాని తొలి అకారమునకు లోపమును గలుగును: నాది, ఇంటిది, రామునిది.

(44) ధాతుజ విశేషణములతో సమర్థములైన యన్ని పదములును జేరి సమాసము లగును: వచ్చినవాడు, వచ్చినయది, వచ్చినవీడు, వచ్చినయిది, చదివిన యెవడు, పడినయేది; రానియప్పుడు; చంపినపులి, పగిలినపలుక; చచ్చిన రావణుడు; వచ్చుమాసము, పోవుచున్న బండి, మొదలయినవి,