పుట:Andhra bhasha charitramu part 1.pdf/823

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మగుచో 'నాలుగు' నకు 'నలు' ఆదేశమగును; 'ప' కు 'వ' ఆదేశమగును: నలువది; 'ఆఱు' నకు 'అఱు' ఆదేశము; 'పది' లోని 'ప' కు 'వ' ఆదేశము: 'అఱువది'; 'ఏడు' నకు 'డె' ఆదేశము: డెబ్బది. 'ఎనిమిది' కి 'ఎను' ఆదేశము, 'ప' కు 'బ' ఆదేశము: 'తొమ్మిది' కి 'తొం' ఆదేశము. 'ప' 'బ' ఆదేశము: తొంబది. వ్యవహారమున 'నలు', 'అఱు' 'ఎను' అనువానికి 'నల, అఱ, ఎన' అని యగును; 'పది' ఇరవై, ముప్ఫై, నలభై, యాభై, అరవై, డెబ్భై, ఎనభై, తొంభై, అను సమాసములలో పై, ఫై, భై, లుగా మాఱినది. 'పది' పూర్వపదమగునపుడు 'పద, పదు, పన్‌' అను రూపములను దాల్చును. ఎనిమిది, తొమ్మిది, అనువానిలో నుత్తర పదమగు 'పది' 'మిది'గా మాఱినది. 'ఇరు'పై నజంత సంఖ్యావాచకాచ్ఛికపదము చేరునపుడు దాని యికారమునకు దీర్ఘము కలుగును: ఈరాఱు, ఈఱేడు.

(41) ప్రకృతియందుగాని, వికృతియందుగాని ప్రధమావిభక్తి ప్రత్యయము కానట్టి మువర్ణ మంతమందు గలిగి పూర్వపదముగా నిలిచిన 'నాము' మొదలగు కొన్నిపదముల తుది మువర్ణమునకు బిందుపూర్వక పవర్ణమును, 'కనుము' మొదలగు కొన్నిటి తుది మువర్ణమునకు 'ప' వర్ణమును సమాసమం దాదేశము లగును. విభక్తి ప్రత్యయముకాని 'మ్ము' అంతమందుగల కొన్నిపదములు సమాసమున బూర్వమందు నిలిచినచో వాని తుది 'మ్ము' నకు '౦ప' ఆదేశమగును.

(i) నామ్వాదులు: నాము, పాము, ప్రే (పే)ము, వేము; నాపచేను, పాపజగము, ప్రే (పే)ప సజ్జ, వేపగింజ.

ఆము, ఈము, గాము, గీము, గోము, చీము, జాము, తూము, దీము, నోము, బాము, బోము - అనుపదముల తుది మువర్ణ మునకు పజ్వర్ణ మాదేశము కాదు. వీనిలో ఆము = అహము; ఈము = హిమము; గాము = గ్రహము; గీము = గృహము; గోము = *గప్తమ్; చీము = *ఛిత్తమ్; జాము = యామము; తూము = ? ; దీము = దీమము; పై.; నోము = సుతము; బాము = భవము; బోము = భూతము. ఇట్లు వీని తుది మువర్ణము మూలమున ప్రథమావిభక్తికి సంబంధించినది గావున దానికి సమాసమున 'పజ్‌' వర్ణ మాదేశము కాలేదు.

(ii) 'మ్ము' అంతమందుగల పదములు: అమ్ము, ఎమ్ము, దమ్ము; అంపకోల, ఎంపప్రోగు, దంపసాగు, ఇమ్ము, ఒమ్ము, కుమ్ము, కొమ్ము, తుమ్ము, దిమ్ము, నెమ్ము, మమ్ము, ఱొమ్ము, వమ్ము - వీని తుది 'మ్ము' నకు '౦ప' ఆదేశము కాదు. ఇమ్ము = హితము; ఒమ్ము = అవహితము; కొమ్ము = ? ;