పుట:Andhra bhasha charitramu part 1.pdf/822

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎచ్చోటు, ఎచ్చొటు, ఎచ్చటు. కృతహ్రస్వంబగు త్రికమనుటచే 'అచటు, ఈచటు, ఏచటు' అనురూపములు లేవని తెలియునవి. 'మూడు' శబ్దముపై సమానాధికరణమున నుత్తరపదము పరమగునపుడు అందలి డుజ్ వర్ణమునకు లోపమయి 'మూ' అని నిలుచును. లుప్తశేషమగు 'మూ' మీది హల్లునకు ద్విత్వము కలుగును; 'చోటు' శబ్దము పరమగుచో నందలి ఓత్వమునకు అత్వద్విత్వములు గలుగును: మూడు + చోటులు = మూ + చ్చోటులు = ముచ్చోటులు, ముచ్చొటులు, ముచ్చటులు; మూడు + కారు = ముక్కారు; మూడు + జగములు = ముజ్జగములు; మూడు + లోకములు = ముల్లోకములు; మూడు + పాతిక = (లు) ముప్పాతిక (లు), మూడు + త్రోవలు = ముత్త్రోవ(లు); మూడు + విధము = మువ్విధము(లు): ఇట్లే ముప్పది, మున్నూఱు, ముక్కోటి, ముమ్మాఱు, మొదలయినవి. ఈకార్యము కొన్నియెడలగాదు; 'ముబ్భువసములు' మొదలగు రూపములు కలుగవు; ఇట్లే ఊష్మరేఫములు పరమందున్నను నీ కార్యము కలుగదు. ముర్రూపములు, మొదలగు రూపములు కలుగవు. 'నాడు' శబ్ద ముత్తరపదమగునపుడు 'మూ' కు హ్రస్వము కలుగదు. ద్విత్వము వైకల్పికమగా గలుగును: మూనాళ్లు, మూన్నాళ్లు. 'నెల' శబ్దము పరమగుచో డుజ్జునకు ణకార మాదేశమగును; 'మూ' కు హ్రస్వము కలుగదు: మూణ్ణెలలు; ద్విత్వమున నొకహల్లు లోపింపదు: 'మూనెలలు' అనికాదు. వేయి శబ్దము పరమగుచో డుజ్జునకు లోపము కలుగదు. మూడువేలు, (మువ్వేయి, మువ్వేలు, అనికాదు). 'మూడు' శబ్దముపై నచ్చు పరమగుచో గూడ గొన్నియెడల డుజ్వర్ణము లోపించి, యడాగమము గలిగిన తరువాత దీర్ఘమునకు హ్రస్వముగలిగి యకారమున ద్విత్వము కలుగును: ఉదా. ముయ్యేడు (మాఱులు); ముయ్యాఱు, ముయ్యేఱు మొదలయినవి.

సంఖ్యావాచకములగు రెండు, ఏడు, పదములపై నెల, నాడు అనునవి చేరునప్పుడు వానితుది డువర్ణ మునకు ణకార మాదేశమగును: ద్విత్వ ణకారమునకు ద్విత్వ ణకారముగాని, క్రింది ణ కారమునకు మాత్రము నకారముగాని కలుగవచ్చును. రెణ్నాళ్లు, రెన్నాళ్లు, రెణ్నాళ్లు, రెణ్ణెలలు, రెణ్నెలలు, రెన్నెలలు; రెణ్ణాళ్లు, ఏణ్నాళు (ఏణ్ణెలలు, ఏణ్నెలలు), ఈరూపములలో ద్విత్వ ణకారమునకు ద్విత్వ నకారము గలుగదు. 'ఏను' (=ఐదు) పై 'నాడు' చేరినచో దానితుది 'ను' వర్ణము లోపించును; ఏనాళ్లు - 'ఏను' పదముపై నెల చేరదు; అనగా ఏనునెలలు, ఏనెలలు, అను రూపములు గలుగవు; కాని, 'పదునేను నెలలు' అనవచ్చును. 'ఏను' పై 'పది' చేరుచో 'ను' వర్ణమునకు బిందువు కలుగును: ఏంబది, ఏబది; (ఏంభది, ఏంభయి) ఏంభై, శాసనములందు కానవచ్చుచున్నవి; వ్యవహారమున యాభై, యేభై); 'పది' అనుపదము పర