పుట:Andhra bhasha charitramu part 1.pdf/818

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అఱుగు(-వు)దెవులు, అలుకుజుట్ట, అదురుగ్రోవి, అదురుద్రిక్క; ఊదుగ్రోవి.

(13) ఉదంత ధాతువులమీదను నీ కార్యము గలుగును: ఉదా. కట్టుగొయ్య, కట్టుగొమ్మ, కట్టుగోక, కట్టుగొంగు, కట్టుగొఱ్ఱు, పొర్లుగట్ట, విచ్చుగత్తి, త్రవ్వుగోల, మెట్టుబ్రాలు, మించుగాలు, తండుగోల, కక్కుదెవులు, ఏగుబెండ్లి, ఎదురుగుత్తుక, వాలుబ్రొద్దు, వాలుగడుపు, వేగుజుక్క, తూగుబలక, ఒత్తుగమ్మి, కట్టుగంబము, పడుగాయ, పడుగొమ్మ, పిడుచుబాత, తొడుగఱ్ఱ, ఎండుదెవులు, ఆనుగఱ్ఱ, కడపుజేయి, తన్నుగోల, చూడుగొడుపు, పెట్లుగ్రోవి మొదలయినవి.

(14) భావార్థక డు వర్ణముమీదను నీ కార్యము గలుగును: ఉఱు కుడుంబొడ్డు, అనుడుంబిల్ల మొదలయినవి.

(15) కొన్నియెడల ధాతువుపై 'పు' వర్ణము చేరును: ఎండపుదట్ట.

(16) కొన్నియెడల ధాతువు తుదివర్ణము లోపించును: ఉడుబోతు పిందె.

(17) ఈ నుగాగమము కొన్నియెడల నితరాచ్చు లంతమందు గల పదములమీదగూడ గలుగును: అకారాంతపదములపై: ఎడదెఱిపి, ఎలదోట, ఒరగట్టు, ఒరగడుగు, ఒరగల్లు, ఒరగాలు, ఒరబదును, ఒఱబెంకు, కడగొఱవి, కమ్మగాడ్పు, కొయ్యగాలు, తలద్రాడు, తిమ్మదియ్యము, తొఱదేనె, నానబ్రాలు, పుట్టగూడు, పుట్టదేనె, తియ్యగూర, పచ్చబ్రాలు, పిల్లగ్రోలు, పిల్లగ్రోవి, పిల్లనగ్రోలు, పిల్లనగ్రోవి, వాఱెనబీట, ఎత్తన గోల, ఎత్తనగోలు, ఒడ్డగెడవు, కందనగాయ, కలపనబిండి, కుదుకనగోలు, కుప్ప(న)గూర, చిమ్మనగ్రోవి, తలబ్రాలు, దీవనబ్రాలు, దోరగల్లు, పాయగొమ్మ, పింజనగ్రోవి, బట్టనగోల.

ఆకారాంత పదములపై: మ్రాగన్ను.

ఇకారాంత పదములపై: ఉరిగోల, ఒడిద్రాడు, ఒడిబ్రాలు, కాడిగట్టు, తరిగోల, తరిదీపు, తరిద్రాడు.

ఎకారాంత పదములపై: వాసెగ్రోలు.

ఏకారాంత పదములపై: క్రేగన్ను, క్రేగయి, చేద్రాడు, లేగసవు, లేబగలు, లేబోక, లేబ్రొద్దు.

ఓకారముపై: మోకాలు.

(18) ధాతువుల తుమున్నంత రూపములపై బరుష సరళములు పరమగునపుడు సహజముగనే ద్రుతకార్యములు గలుగును: ఒల్లబోక, కలగలపు, వడియబోత, దిగదుడుపు, తిరుగబోత.