పుట:Andhra bhasha charitramu part 1.pdf/812

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యయాతి. IV; వీరముద్దియలు - 'మట్టియలు వీరముద్దియలు పాయభట్టంబులు - నైష. VI' చంద్రకావి - 'అల వసంతధరాకాంతు డరుగుదేర రాచిలుకచాలు పచ్చతోరణముగాగ, పాంద్రగతిగట్టు మేల్కట్టు చంద్రకావి యంశుకంబులు నా బూచె గింశుకంబు - రామా. I; వాగగన్నెరు - 'వాగగన్నెరులు మూనాళ్ళ సొబగు - భల్లా. III; నాగపడగలు; నాగపడగలదండ - 'భాసురంబగు నాగపడగలదండ, యాసలజేరె వయ్యతివ నీదండ - భాగ.X; నాగబెత్తము - 'మలగొను చిన్ని కెంజడలు మంతుల పొత్తము నాగబెత్తమున్... జెలువలరంగ నొప్పు నొక సిద్ధుడు సింగపు వారువంబుతోన్ - కళా. II; నాగవాసము - 'వనుపుకాడ వేల్పు నాగవాసముగూడి మహిమ గోల్పోయెనే మాండకర్ణి - మను. II; నాడెంపుగోటల నాగవాసంబుల గొమ్మలు గొమ్ములు గొనలుసూప - అచ్చ. బాలకాం.' నాగసరము - 'కంచు కొమ్ములు బూరగలు నాగసరము, లంచితపటహ కాహళములు సరుమ - నల. II; నిరాపనింద - 'పినతల్లివి పెనుపగనోపిన తల్లివి గాన వచ్చి పిలిచిన నయ్యో, కనికరములేక వానింగని కరము నిం'పనింద గట్టందగునే - సారం. III; పరవాది - 'మితిలేని తేనె నామెతజేసె విరవాది, యితరలతికల మరగి యేగునది పరవాది - మను. III; ఉపతాయి - 'ఉపతాయిలోదవకొదవెడు తోరహత్తము చూపి - భార. విరా. II; గరుడపచ్చ - గరుడపచ్చల చాయగల పచ్చగందని కూరలు శైవలాంకురములయ్యె. వై. VII; మదహత్తి - 'అచటి యొకపాటి దొర మదహత్తులకును నెత్తుగున్నలు దిక్కుల మత్తకరులు - పాంచా. V. కరదివ్వె (-వియ, -వ్వియ) - కరమున బూనిన ఖడ్గప్రకాశ మరుదుగా గరదివ్వెయై త్రోవజూప - హరిశ్చ. I; కరవాలు తివిరి కరవాలు నేకొని, ఱవఱవ లెసగంగ నత్తెఱవపై బడుచో - అచ్చ. సుం. కాం.]

ఇట్లే అతివస, అంతరదామర, అంతరపల్లటీ, అపసిరి, అవదాయము, అవసడి, గరుడసరులు, పాండవబీడు, బాలసంగడము, గళకత్తెర, మూలదుంప, రసగుండు, లింగకట్టుమాత్ర, లింగకాయ, లింగదొండ, లింగపొట్ల, లింగబలిజులు, లింగరాజు, వజ్రగార, వీరభద్రపళ్లెరము, నాగదాళి, నాగనేరెడు, నాగపెంజెర, నాగమల్లె, నాగముస్తె, నదాముస్తె, పరపత్తెము, దీపకంభము మొదలయినవి నిఘంటువుల కెక్కినవి.

లోకములో శుద్ధ, శుక్ల, బహుళ అను పదములతో వైకృతనామములు గల తిథులపేళ్లు సమసించి వినబడుచున్నవి: శుద్ధపాడ్యమి, శుద్ధ విదియ, శుద్ధతదియ, శుద్ధచౌతి; ఇట్లే శుక్ల (బహుళ) పాడ్యము (విదియ, తదియ, చౌతి), మొదలగు మిశ్రసమాసములు వినబడుచున్నవి. ఈ రీతిగనే సంవత్సరాది పాడ్యమి, గౌరీపున్నమ మొదలగునవి. ఇవిగాక కంఠసరులు, శుద్ధతప్పు, శుష్కదండుగ, అనేక మా(-సా)ర్లు, అనేక మంది, అల్పసిరి, స్వల్పడబ్బు, దురలవాటు, దుస్సలహా మొదలగు ననేక మిశ్రసమాసములు వ్యవహారమున బహుళప్రచారమున నున్నవి. సంజ్ఞావాచకములలో జగన్నాథరావు, సుబ్బారాయావధాని, అన్నప్పశాస్త్రి, అనంతవరము, శ్రీకాకుళము, సింహాద్రి అప్పన్న, కృష్ణదేవరాయలు మొదలగునవి.