పుట:Andhra bhasha charitramu part 1.pdf/808

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వివేక సౌరభ విభాసిత సద్గుణపుంజ వారిజోత్కర రుచిరంబులై ...మహా మనోహర సుచరిత్ర పావన యప:పరిపూర్ణములైన సతృభాంతర సరసీవనంబుల...గినియాడి... భారత సంహితా రచన బంధుర" డయ్యెను.

నన్నయ తాను రచించిన గ్రంథమునంతటిని సంస్కృతపద భూయిష్ఠముగను సంస్కృత సమాస భూయిష్ఠముగను జేసినాడు. ఆతడు గ్రంథము నెట్లారంభించెనో దాని రచనమునుండి విరమించునప్పుడు నట్టి బిగితోడనే వదలి పెట్టెను. చూడుడు-

    "శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారక హారపంక్తులం
     జారుతరంబులయ్యె, వికసన్నవ కైరవ గంధ బంధురో
     దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
     ర్పూర పరాగ పాండురుచి పూరములం బరిపూరితంబులై."

నన్నయ విడిచిన భాగము నెత్తికొని యెఱ్ఱప్రగడయు (అతడే యరణ్య పర్వశేషమును బూరించిన వాడైనచో) నట్టి బిగితోడనే యారంభించినాడు. చూడుడు-

     స్ఫురదరుణాంశురాగరుచి బొంపిరివోయి నిర స్త నీరదా
     వరణములై దశత్కమలవైభవ జృంభణ ముల్లసిల్ల ను
     ద్ధురతర హంససారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా
     గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళ జూడగన్.

     అతి గాంభీర్యవిభూతి సేకచులుకాహంకార నిశ్శేషశో
     షితపాథోధి పయస్కుడైన ముని దోచె బుణ్యతేజోమయా
     కృతి నయ్యామ్యదిగంతవీథి బ్రకటక్రీడాకళాగర్వ గ
     ర్జిత మండూక కళంకితాంబుశుచితాసిద్ధిప్రదా చార్యుడై."

ఈ ధోరణి యెఱ్ఱాప్రెగడ యితరగ్రంథములందును గాన్పించుచున్నది. తిక్కనయు భారతాంధ్రీకరణారంభమున నీ సమాసరచనావేశమునకు లోబడెను.

"తత్ప్రసాదాసాదిత కవిత్వ తత్త్వ నిరతిసయాను భవానంద భరితాంత:కరణుండ నగుచుండి" - అని యెత్తుకొనెనుగాని వెంటనే మేల్కొనెనో యనునట్లు తనకు సహజమగు తెనుగుధోరణి నవలంబించెను. నన్నయభారతమున దెనుగు రచన యెచ్చటనయిన గాన్పించినచో హాయి యనిపించును; అట్లే, సహజమధురదేశి రచనాబంధురమగు తిక్కన భారతమున నచ్చటచ్చట సంస్కృత రచనచేరి సంతోషపారవశ్యమును జేకూర్చుచుండును. నన్నయ రచనయందు సంస్కృతపు డొంకలతో నిబిడమైనయడవిమధ్యమున తెనుగు