పుట:Andhra bhasha charitramu part 1.pdf/807

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అర్ధమాగధి: లోహగర ధమ్మమాణ ధమధమేంత ఘోసం = సం. థ్మాయమాన లోహకర ధమధమాయమాన ఘోషమ్(ఉవాసగదసాఓ * 108); తడివిమల - సరిస = సం. విమలతటి త్సదృశ (కప్పసుత్త I. 35); ఉడువఈ పడిపుణ్ణఅ సోమపయణే = సం. ప్రతిపూర్ణోడుపతి సౌమ్యవదన: (ఓవవఇయ నుత్త పు. 29. 13.)

సమాసములందలి యిట్టి వ్యత్యాసము లాధునిక ప్రాకృతభాషల యందును గాన్పించుచున్నది. వ్యావహారిక భాషలయందలి యీ సమాసముల వ్యత్యాసము గ్రాంథికభాషలయందును గలిగియుండవచ్చును. తెనుగు కవులును సమాసములం దిట్టి వ్యత్యాసములను జేసిరి. కాని సమాసముల విషయమున గ్రాంథికభాషలకును వ్యావహారిక భాషలకును ముఖ్యమగు భేదమొకటి కలదు. తొల్లింటి సంస్కృత కావ్యములందు దీర్ఘ సమాసములు లేవు. రెండు మూడు పదములకంటె నెక్కువ చేరి యేర్పడిన సంస్కృతసమాసములు భాస కాళిదాసాదుల గ్రంథములందు కాన్పించవు. దీర్ఘసమాసకల్పనమునకు బాణుని కాదంబరి కారణమై యుండును. ఆరభటీవృత్తియందును, గౌడరీతి యందును నిట్టి దీర్ఘసమాసములు కావలసియుండునని లాక్షణికులు తలంపసాగిరి. ఈ యాచార మన్నియెడలను వ్యాపించెను. ప్రాకృత కావ్యములందును దీర్ఘసమాసములు కల్పింపబడసాగెను. ఈ సంప్రదాయ మాధునిక ప్రాకృతకావ్యములందును గానవచ్చుచున్నది. కాని, యిది ద్రావిడభాషల యందు ముఖ్యముగా నాంధ్ర కర్నాటక భాషలయందు తొలుతనుండియు సంపూర్ణముగ సంక్రమించినది. ఆంధ్ర కర్నాట భాషలయం దీ సంస్కృతమందలి యర్వాచీన సంప్రదాయము ప్రబలినది. తెనుగున నన్నయ భారతము నారంభించుచు-

"హరిహర హిరణ గర్భ పద్మోమా వాణీపతుల స్తుతియించి తత్ర్పపాద సమాసాదిత నిత్య ప్రవర్ధమాన మహామహీరాజ్య విభవుండును, నిజభుజవిక్రమ విజితారాతి రాజనివహుండును, నఖిల జగజ్జేగీయమాన నానా గుణరత్న రత్నాకరుండును...అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు, విశుద్ధ యశశ్శరదిందు చంద్రికారాజిత సర్వలోకు డపరాజిత భూరి భుజాకృపాణ ధారాజులశాంత శాత్రవ పరాగుడు.. ఘనదురితానుబంధ కలికాలజ దోష తుషార సంహతం (దవ్వుగబోపి)... రాజ్యసంతత నితాంత విభూతిని... ధర్మ దయార్ద్ర నిబద్ధ బుద్ధియై... అఖిల జలధివేలా పలయిత వసుమతీ వనితా విభూషణంబయిన... రాజమహేంద్రపురంబు నందు... మంత్రి పురోహిత సేనాపతి దండనాయక దొఎవారిక మహాప్రధానానంత సామంత విలాసినీ పరివృతుండయి... జనమత కృష్ణ ద్వైపాయనముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థము ... (తెనుగున రచియింపుమన) ...దుర్గమార్థ జలగౌరవ భారత భారతీ సముద్రము దఱియంగ...పేరబోలునే...(అయినను...రచియించెదవని)...హరిహరాజ గజాన దార్క షడాన్యమాతృ సరస్వతీ గిరి సుతాదిక దేవతాతతికి (న్నమస్కృతి సేసి)...పరిమ