పుట:Andhra bhasha charitramu part 1.pdf/806

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వి + కిరము = విష్కిరము, లేక వికిరము (ఒకవిధమగుపక్షి); ప్రతి + కశుడు = ప్రతిష్కశుడు; ప్రతికశము = (కొరడా)తో తోలబడునది (గుఱ్ఱము).

ప్ర + కణ్వుడు, హరి + చంద్రుడు అనునవి ఋషివాచకము లగునపుడు 'ప్రస్కణ్వుడు, హరిశ్చంద్రుడు' అను రూపములను బొందును. ఋషివాచకములు కానప్పుడు 'ప్రకణ్వుడు, హరిశ్చంద్రుడు.'

మస్కరమనగా వెదురు; మస్కరి యనగా భిక్షువు; 'మకర' మనగా మొసలి; మకరి = మకరములు గలది (సముద్రము).

కాస్తీరము, అజస్తుందము, అనునవి దేశములు; కాతీరము = చిన్న తీరముగల ప్రదేశము; అజతుందము = అజమునకువలె తుందము గలది.

కారస్కర మనున దొకవృక్షము, వృక్షార్థము లేనపుడు 'కారకరము' పారస్కర (దేశము), కారస్కర (వృక్షము), రథస్యా (నది), కిష్కు (ప్రమాణము), కిష్కుంధా (గుహ), తస్కరుడు = చోరుడు, బృహస్పతి = ఒకదేవత; ప్రాయశ్చిత్తి, ప్రాయశ్చిత్తము, వనస్పతి - ఇట్టి సమాసములందును 'నుట్‌' అను నాగమము గలుగుచున్నది:-

ప్రాకృతభాషలలో సమాస విధానము.

ఇట్లు పాణిని తెలిపిన సమాస విధానమునకును బ్రాకృత గ్రంథములయందు కనబడుదానికిని గొన్ని భేదములు కానవచ్చుచున్నవి. ప్రాకృత భాషలు కొన్ని పాణినీయ సంప్రదాయము నవలంబింపక పోవుట దీనికి గారణమై యుండును. లేదా, తొల్లింటి పాణినీయ సంప్రదాయము రానురాను బ్రాకృత భాషలలో మార్పు చెందియుండవచ్చును. ఇట్టి మార్పుల కుదాహరణము లీక్రింద చూపబడినవి, -

మాహారాష్ట్రి: ధవల కఓఅవీఅ = సం. కృతధవలోపవీత (గ ఉ డ వ హో, 1); కాసర విరల కుముఆ = సం. విరల కుముదకాసారా: (గ ఉ డ వ హో 27); విరహ కరవత్త దూసహ ఫాలిజ్జంతమ్మి = సం దుస్సహ విరహ కరపత్త్ర స్ఫాల్యమానే (హాలుని సప్తశతి, 153); దరలంబి గొచ్ఛ క ఇ క చ్ఛు నచ్ఛహం = సం. దరలంబి కపికచ్ఛు గుచ్ఛ సదృశమ్ (హాలుని సప్తశతి 533); ముహలఘణ పఅ విజ్జంతఅం = సం. ముఖరఘన పీయమాన పయనమ్ (సేతుబంధము II. 24); సంఖోహువ్వత్త ణింత రఅణ మఊహం = సం. సంక్షోభోద్వృత్త రత్న నిర్యన్మయూఖమ్ (సేతుబంధము V. 40); పచ్ఛన్నపలాన = సం. పలాశ ప్రచ్ఛన్న (ఆయారంగనుత్త I. 6; I. 2.); కఅణీబ్బర దనదినం = నిర్భరీకృత దశదిశ (సేతుబంధము VIII. 27).