పుట:Andhra bhasha charitramu part 1.pdf/804

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శర, వంశ, ధూమ, అహి, కపి, మణి, ముని ,శుచి, హను, అనుపదములపై మతుప్ - ప్రత్యయముచేరి సంజ్ఞావాచకమగునప్పుడును వాని తుది యచ్చునకు దీర్ఘము కలుగును: శరావతి, వంశావతి మొదలయినవి.

'పీలు' శబ్దమునందు తప్ప 'ఇ, ఉ' లంతమందుగల పదములకు 'సహ' అనుపదము పరమగునపుడు వాని తుదియచ్చునకు దీర్ఘము కలుగును:-

ఋషీవహము, కపీవహము, మునీవహము మొదలయినవి. 'పీలు' పదముననేకాక మఱికొన్ని పదములందు నీ దీర్ఘము కలుగదు: దారువహము.

'ఘఞ్‌' అను కృత్ప్రత్యయమందుగల పదమునకు బూర్వమందున్న యుపవర్గము తుదియచ్చునకు దీర్ఘము బహుబలముగా గలుగును: సమాసము మనుష్యవాచకమగుచో నీ కార్యము గలుగదు: పరీపాకము, పరిపాకము, ఇచట వైకల్పికము - ప్రసేచము, ప్రసారము; ఇచట కలుగదు. ప్రాసాదము, ప్రాకారము. స్థలవాచకము లగునపుడు వీనియందు నిత్యము. 'వేశ' మొదలగు పదములు పరమందున్నచో దీర్ఘము వైకల్పికము: ప్రతి(తీ)వేశము, ప్రతి(తీ)రోధము మొదలగునవి. మనుష్యవాచకమగునపుడు 'నిషాదుడు' - కాని, 'ప్రతీహారుడు' అనురూపము సాధువే.

'కాశ' అనుపదము పరమయినపుడు ఇ, ఉ, లతో నంతమగు నుపసర్గము తుదియచ్చునకు దీర్ఘము కలుగును: వీకాశము, నీకాశము.

సంజ్ఞావాచకమగు సమాసమున బూర్వపదమగు 'అష్టన్‌' లోని తుది వర్ణమునకు దీర్ఘాచ్చు ఆదేశమగును: అష్టాపదము.

కప్ ప్రత్యయముచేరిన 'చితి' శబ్దము తుదియచ్చునకు దీర్ఘము కలుగును: ఏకచితీకుడు.

సమాసము సంజ్ఞావాచకమగునపుడు 'నర' శబ్దము పరమందున్న 'విశ్వ' అనుపదము తుదియచ్చునకు దీర్ఘము కలుగును: విశ్వానరుడు.

సమాసము ఋషిసంజ్ఞావాచకమగునపుడు మిత్రశబ్దము పరమందున్న 'విశ్వ' అనుపదము తుదియచ్చునకు దీర్ఘము కలుగును: విశ్వామిత్రుడు.

(20) సమాసము సంజ్ఞావాచకము కాకున్నను 'ప్ర, నిర్, అంతర్, శర, ఇక్షు, ప్లక్ష, అమ్ర, కార్ష్య, ఖదిర, పీయూక్షా' అనుపదములు పూర్వమందుగల 'వన' అనుపదములోని 'న' కు 'ణ' ఆదేశమగును: ప్రవణము, నిర్వణము, అంతర్వణము, శరవణము, ఇక్షువణము, ప్లక్షవణము, అమ్రవణము, ఖదిరవణము, పీయూక్షావణము.

సమాసము ఓషధి, వనస్పతివాచకమై పూర్వపదమున నకారమును ణకారముగా మార్పగల వర్ణమున్నప్పు డుత్తరపదమగు 'వన' అనుపదము