పుట:Andhra bhasha charitramu part 1.pdf/801

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యత్ - ప్రత్యయము పరమందుగల 'ఉదర' శబ్దమునకు బూర్వమందున్న 'సమాస' అనుపదమునకు 'స' అను నాదేశము వైకల్పికముగా నగును" సోదర్యుడు, సమానోదర్యుడు.

దృక్, దృశ్, దృక్ష అను పదములకు బూర్వమందున్న 'సమాస' అను పదమునకు 'స' ఆదేశమగును: సదృక్కు, సదృశుడు, సదృక్షుడు.

(15) దృక్, దృశ్, దృక్ష అను పదములు పరములగునపుడు 'ఇదమ్' పదమునకు (ఈ) అనునదియు, 'కిమ్‌' పదమునకు 'కీ' అనియు నాదేశము లగును: ఈదృక్కు, ఈదృశము, ఈదృశుడు; కీదృక్కు, కీదృశము, కీదృశుడు. కీదృక్షము, కీదృక్షుడు.

(16) సమాసమున నంగులి శబ్దమునకు బరమగు 'నంగ' శబ్దములోని నకారమునకు షకార మాదేశమగును: అంగులిషంగము.

సమాసమున భీరుపదము పూర్వమందున్న స్థానశబ్దమందలి సకారమునకు షకార మాదేశమగును: భీరుష్ఠానము.

జ్యోతిస్, ఆయుస్, అను పదములకు సమాసమున బరముగానున్న 'స్తోమ' శబ్దమునందలి సకారమునకు షకార మాదేశమగును: జ్యోతిష్ఠోమము, ఆయష్ఠోమము.

నుషామము, ని:షామము, దు:షామము; నుషేధము, నిషేధము (ని:షేధము); దు:షేధము, నుషంధి, ని:షంధి (నిషంధి), దు:షంధి; సుష్ఠు, దుష్టు (దుష్ఠు), గౌరిషక్థుడు (సంజ్ఞావాచకము), ప్రతిష్ణిక, జనాషాహము, నౌషేచనము, (నౌషేవనము), దుందుభిషేవణము, (దుందుభిషేచనము, దుందుభిషేవనము), హరిషేణుడు, నక్షత్రషే (-సే)నుడు, రోహిణీషేణుడు. ఇట్టి పదములయందు సకారస్థానమున షకారము వచ్చినది.

సంజ్ఞావాచకసమాసమున పదము తొలి సకారముపై 'ఏ' యను నచ్చుచేరి దానికి బూర్వమున ఇ, ఉ, ఋ, లు గాని, క, ఖ, గ, ఘ, ఙ లు గాని యున్నచో సకారమునకు షకార మాదేశమగును: హరిషేణుడు, పరిషేణుడు, వారిషేణుడు, జానుషేణి.

పై సందర్భములందు గలుగు సమాసము నక్షత్ర సంజ్ఞావాచకమైనచో సకారమునకు షకారము వైకల్పికముగా నగును: రోహిణీషేణుడు, రోహిణీసేనుడు.

(17) అశిన్, అశా, ఆస్థా, అస్థిత, ఉత్సుక, ఊతి, కారక, రాగ అను పదములును, 'ఛ' = ఈయ అను ప్రత్యయ మంతమందుగల పదములును షష్ఠీవిభక్తియందులేని 'అన్య' అనుపదమునకు బరమందున్నపు డాపద