పుట:Andhra bhasha charitramu part 1.pdf/799

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(9) సంజ్ఞావాచకపదములందును, వేదములందును స్త్రీలింగప్రత్యయములగు జీ (ఈ), అ (ప్), అనువానికి బహులముగా హ్రస్వము వచ్చును: అహ్రస్వము కలుగుటకు: రేవతిపుత్రుడు. హ్రస్వమురానందుకు: నాందీకరుడు, నాందీఘోషము, నాందీవిశాలము. వేదములో హ్రస్వము కలిగినందుకు: కుమారిదార. వేదములో కలుగనందుకు: ఫాల్గునీ పౌర్ణమాసీ (తె. - సి); జగతీచ్ఛంద: (తె. - ము). సంజ్ఞావాచకపదములలో ఆప్ ప్రత్యయము: హ్రస్వము కలుగుటకు; అజక్షీరము, శిలప్రస్థము; కలుగనందుకు: లోమకాగృహము, లోమకాఖండము. వేదములో హ్రస్వము కలుగుటకు: అజక్షీరేణ జుహోతి; కలుగనందుకు: ఊర్ణాసూత్రేణ కవయోవయంతి.

(10) త్వ - ప్రత్యయమునకు బూర్వమందున్న 'ఈ, ఆ' అను స్త్రీ ప్రత్యయములు బహులముగా హ్రస్వములగును: అజ (-జా) త్వము, రోహిణి (-ణీ)త్వము.

(11) చిత, అనుపదము పరముగానున్న 'ఇష్టికా' పదమునందును, 'తూల' అనుపదము పరముగానున్న 'ఇషికా' పదమునందును, 'భారిస్‌' అను పదము పరముగానున్న 'మాలా' పదమునందును దుది దీర్ఘమునకు హ్రస్వము గలుగును: ఇష్టకచితము, ఇషీకతూలము, మాలభారిణి (కన్య).

(12) 'కార' అనుపదము పరముగానున్న 'సత్య', 'అగద' అనుపదముపై 'ముమ్‌' అనునాగమము గలుగును. సత్యంకారము, అగదంకారుడు.

'అన్తు' పై 'కార' చేరినను నీయాగమము గలుగును: అన్తుంకారము.

'భవ్యా' శబ్దపరకమగు ధేను శబ్దముమీదను నీయాగమము కలుగును: ధేనుంభవ్య.

'పృణ' శబ్దపూర్వక 'లోక' శబ్దముమీదను నీయాగమము గలుగును: లోకంపృణుడు.

'ఇత్య' పదపూర్వక 'అనభ్యాశ' పదముమీదను గలుగును: అనభ్యాశ మిత్యము.

'ఇంధ' పదపూర్వక 'భ్రాష్ట్ర, అగ్ని' అనుపదములమీదను గలుగును: భ్రాష్ట్రమింధుడు, అగ్నిమింధుడు.

'గిల' శబ్దపూర్వక పదముమీదను గలుగును: తిమింగలము; 'గిల' అనునది పరమైనచో గలుగదు: గిలగిలము.

'గిలగిల' శబ్దపూర్వక పదముమీదను 'ముమ్‌' అగమమగును: తిమిం గిలగిలము.