పుట:Andhra bhasha charitramu part 1.pdf/797

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(2) నదీసంజ్ఞగల తక్కిన స్త్రీలింగపదముల తుదిదీర్ఘమునకు బై సందర్భములందు హ్రస్వము వైకల్పికముగా నగును. కృదంత నదీవాచకపదముల కీమాత్రము వర్తింపదు.

జీ - ప్రత్యయాంతములు కాని స్త్రీలింగపదములు నదీసంజ్ఞకములు. ఇవికాక ఈకారాంతములై యేకాక్షర పదములకును నీ సూత్రము వర్తించును: బ్రహ్మబంధుతరా, బ్రహ్మబంధూతరా, స్త్రితరా, స్త్రీతరా.

కృత్ప్రత్యయముచేరిన పదములుకావున లక్ష్మీ, తంత్రీ పదముల దీర్ఘమునకు హ్రస్వము కలుగదు: లక్ష్మీతరా, తంత్రీతరా.

(3) ఉ, ఋ, లు ఇద్వర్ణములుగాగల తద్ధిత ప్రత్యయములపై జేరిన స్త్రీ ప్రత్యయమగు 'జీ^' (ఈ) అనునది వైకల్పికముగా హ్రస్వమగును. విదుషితరా; హ్రస్వము కలుగనప్పుడు పుంవద్భావము గలిగి 'విద్వత్తరా.'

(4) లేఖ, లాస, అనుపదములకును యత్, అణ్, ప్రత్యయాంత పదములకును బూర్వమందుండు 'హృదయ' శబ్దమునకు 'హృద్‌' అను దాదేశమగును: హృల్లేఖము. హృల్లాసము, హృద్యము, హార్దము.

శోక, రోగ, అనుపదములుగాని, ష్వజ్ - ప్రత్యయముగాని పరమందుచేరిన హృదయశబ్దమునకు 'హృద్‌' అనున నాదేశమగును. హృశోకము, హృదయ - శోకము; హృద్రోగము, హృదయరోగము, సౌహార్ద్యము, సొఎహృదయ్యము.

(5) ఆజి, ఆతి, గ, ఉపహత అనువానికి బూర్వమందు వచ్చు పాదశబ్దమునకు 'పద' అనునాదేశమగును: పదాజ, పదాతి, --- , పదోపహతుడు.

'దానికి సరిపోయిన' అనునర్థమునందు తప్ప, తక్కిన యర్థములందు వచ్చు యత్ - ప్రత్యయము చేరునప్పుడు 'పాద' శబ్దమునకు 'పద్‌' అను నాదేశము గలుగును: పాదములను వేధించునవి 'పద్యములు (ఱాళ్లు); (ఉదకములు) పాదార్థములు.

'హిమ, కాషిన్, హతి' శబ్దముల పూర్వమందున్న పాదశబ్దమునకు 'పద్‌' అనునాదాదేశమగును; పద్ధిమము, పత్కాషి, పద్ధతి.

'శస్‌' ప్రత్యయముచేరిన పాదశబ్దమునకు ఋగ్వేద మంత్రమర్థమున 'పద్‌' అనున దాదేశమగును: పాద + శ: = పచ్ఛ: (గాయత్రీం పచ్ఛ: శంసతి).