పుట:Andhra bhasha charitramu part 1.pdf/796

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బ్రాహ్మణకులము - 'యుక్తి' అను పదము పరమందుగల 'వాక్‌' శబ్దము మీదను, 'దండ' పరకమగు దిశ్ - శబ్దముమీదను, 'హర' శబ్దపరకమగు 'పశ్యత్‌' శబ్దముమీదను గూడ షష్ఠీవిభక్తి ప్రత్యయము లోపింపదు: వాచోయు కి, దిశోదండము, పశ్యతోహరుడు.

ఆముష్యాయణుడు, ఆముష్యపుత్రిక, ఆముష్యకులిక, దేవానాం ప్రియుడు అనువానియందును షష్ఠీప్రత్యయమునకు లోపములేదు.

'దాస' శబ్దము పరముగానున్న 'దివ్‌' శబ్దముమీది షష్ఠీప్రత్యయము లోపింపదు: దివోదాసుడు.

(17) నిందార్థమున పుత్ర్రశబ్దము పరముగానున్న పదముమీది షష్ఠీ ప్రత్యయము వైకల్పికముగా లోపింపదు: దాస్యా:పుత్త్రుడు, దాసీపుత్త్రుడు. నిందార్థము లేనప్పుడు: బ్రాహ్మణీపుత్త్రుడు.

పుత్త్రశబ్దము పరమగునపుడు ఋదంతమై విద్యాసంబంధమునుగాని, రక్తసంబంధమునుగాని తెలుపు పదముమీది షష్ఠీప్రత్యయము లోపింపదు: హోతురంతేవాసి, హోతు:పుత్త్రుడు, పతురంతేవాసి, పితు:పుత్రుడు.

(18) స్వసృ, పతిశబ్దములు పరములుగానున్న ఋదంతశబ్దముల షష్ఠీప్రత్యయమునకు వైకల్పికముగా లోపముగలుగదు: మాతు:స్వస, మాతృష్వస; పితు:స్వస, పితృష్వస; దుహితు:పతి, దుహితృపతి, ననాందు:పతి, ననాందృపతి.

మాతుర్, పితుర్ శబ్దములకు పరమందున్న స్వసృశబ్దము మొదటి నకారమునకు షకారము వైకల్పికముగా నగును: మాతు:స్వస, మాతు:ష్వస; పితు:స్వస, పితు:ష్వస.

మాతృ, పితృ శబ్దములకు బరమందున్న స్వసృశబ్దము తొలి సకారమునకు షకారమగును: మాతృష్వస, పితృష్వస - సమాసము కలుగునప్పుడు: మాతు:స్వసా, పితు:స్వసా.

సమాసాశ్రయవిధిప్రకరణము.

(1) తర, తమ, రూప, కల్ప అను ప్రత్యయములకును, చేల (ట్), బ్రువ, గోత్ర, మత, హత అనుపదములకును బూర్వమందు వచ్చు అనేకాక్షరములు కలిగి, సమాస పుంలింగరూపముగల జీప్రత్యయాంత స్త్రీలింగ పదము తుది దీర్ఘమునకు హ్రస్వముగలుగును: బ్రాహణితరా, బ్రాహ్మణి తమా, బ్రాహ్మణిరూపా, బ్రాహ్మణికల్పా, బ్రాహ్మణిచేలీ, బ్రాహ్మణిబ్రువా, బ్రాహ్మణిగోత్రా, బ్రాహ్మణిమతా, బ్రాహ్మణిహతా.