పుట:Andhra bhasha charitramu part 1.pdf/794

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(2) ఓజస్, సహస్, అంభస్, తమస్, అను పదములమీది తృతీయా విభక్తి లోపింపదు: ఓజసాకృతము, సహసాకృతము, అంభసాకృతము, తమసాకృతము మొదలైనవి. 'అంజస్‌' శబ్దమునుగూడ బైవానికి జేర్పవలెను: అంజసాకృతము - పుంసాగ్రజుడు, జనుషాంధుడు, అను సమాసములు నిట్టివే.

(3) ఉత్తర పదముచేరి సంజ్ఞావాచక మగునప్పుడు 'మనస్‌' శబ్దముమీది తృతీయా విభక్తిప్రత్యయము లోపింపదు: మనసాగుప్త - సంజ్ఞావాచకము కానప్పుడు: మనోదత్త, మనోగుప్త.

'ఆజ్ఞాయిన్‌' అను పదమునకు బూర్వమందున్న మనశ్శబ్దముమీది తృతీయావిభక్తి ప్రత్యయము లోపింపదు: మనసాజ్ఞాయి.

'ఆత్మన్‌' శబ్దముమీది తృతీయాప్రత్యయమును లోపింపదు: ఆత్మనాపంచముడు = తనతో అయిదుగురు గలవాడు. ఇట్లులోపింపకుండుట హకారణార్థక సంఖ్యావాచకము పరమందు వచ్చినప్పుడు యగును: ఆత్మకృతము.

(4) వ్యాకరణమున సంజ్ఞను ------------- చతుర్థివిభక్తి ప్రత్యయము లోపింపదు: ఆత్మనేపదము