పుట:Andhra bhasha charitramu part 1.pdf/793

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(10) 'ప్రతి' అనుదానికి బరముగా సప్తమ్యర్థమున వచ్చు 'ఉరస్‌' శబ్దముపై గూడ 'అచ్‌' ప్రత్యయము చేరును: ప్రత్యురసము.

(11) ఓకారాంత గోశబ్దముతో గలిసిన 'అనుగవము' అనుసమాసము 'అచ్‌' ప్రత్యయాంతమై ఆయామార్థమును బొందుచున్నది.

(12) ద్వి: + తావత్ = ఇంతకంటె రెండింతలు; త్రి: + తావత్ = ఇంతకంటె మూడింతలు అనునర్థమున 'వేది' శబ్దమునకు విశేషణములై 'ద్విస్తావా, త్రిస్తావా' అను సమాసము లేర్పడుచున్నవి.

(13) సమాసమున నుపసర్గము పూర్వమందుగల 'అధ్వన్‌' అను పదము మీదను 'అచ్‌' ప్రత్యయము చేరును: (రధము) ప్రాధ్వము = చాలదూరము పోయినది.

(14) ను, అతి, అను నుపసర్గములు తప్ప పూజార్థముగల పదములు సమాసమున బూర్వపదములుగా నున్నచో నా సమాసములపై సమాసాంత ప్రత్యయములు చేరవు: పరమరాజ: (పరమరాజుడు), పరమగవ:, (పరమగవుడు) - వీనిలో ను, అతి, అను నుపసర్గములు లేవు. కాని, సురాజా (సురాజు), అతిరాజా (అతిరాజు); ఇట్లే మహారాజ: = మహారాజుడు = గొప్పరాజులు గలవాడు; మహారాజు = గొప్పరాజు.

(15) ;కిమ్‌' పూర్వశబ్దముతో గలిసి నిందార్థమును బొందినసమాసముమీదను సమానాంతప్రత్యయములు చేరవు. కింరాజా, కిం సఖా, కిం గౌ:.

(16) రాజన్ మొదలగు పదములకు బూర్వము 'నఞ్‌' చేరిన సమాసములతుదిని సమానాంతప్రత్యయములు చేరవు: అరాజా, అసఖా, అధురమ్ (శకటమ్).

(17) నఞ్ పూర్వక పథిన్ శబ్దమువలన గలిగిన తత్పురుషసమాసముపై వైకల్పికముగా సమానాంతప్రత్యయములు చేరవు: అపధము = చక్కని బాటలులేని దేశము; అపంథ = బాటలు లేకుండుట.

అలుక్సమాసము.

సమాసమున నుత్తరపదమునకు బూర్వ మీక్రింది సందర్భములందు విభక్తి ప్రత్యయములకు లోపము కలుగదు.

(1) స్తోక మొదలగు పదములమీది పంచమికి లోపము లేదు: స్తోకాన్ముక్తుడు, అల్పాన్ముక్తుడు, అంతికాదాగతుడు, అభ్యాశాబాగతుడు, దూరాదాగతుడు, విప్రకృష్టాదాగతుడు, కృచ్ఛ్రాన్ముక్తుడు మొదలైనవి. వీనికి 'బ్రాహ్మణాచ్ఛంసి' అను సమాసమును జేర్పవలెను.