పుట:Andhra bhasha charitramu part 1.pdf/787

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(14) ఒక నియతసంఖ్యగల యధికరన (అప్రాణివాచకములు, అద్రవ్యవాచకములు) పదముల ద్వంద్వసమాసము ఏకవచనమును నుండవలయునను నియమము లేదు: దశదంతోష్ఠములు, పదేసి దంతములు, పదేసి పెదవులు.

ఒక సంఖ్య నించుమించుగా దెలియజేయు పదముల ద్వంద్వసమాసము వైకల్పికముగా నేకవచనమం దుండును: ఉపదశదంతోష్ఠము(లు).

(15) ఋకారాంతపదములు రెండుచేరి ద్వంద్వసమాస మగునపుడు దానిలోని పూర్వపదము ఋకారమునకు ఆ(సజ్) అనున దాదేశమగును: హోతాపోతారులు, నేష్టోద్గాతారులు - గాని, హోతృపోతృనేష్టోద్గాతారులు. దీనిలో హోతృపోతృ పదములపై నుత్తరపదము లేదుగనుక వాని ఋకారమున కాదేశము రాలేదు.

(16) దేవతా వాచకపదముల ద్వంద్వసమాసమున బూర్వపదము తుదియచ్చునకు దీర్ఘము కలుగును: మిత్రావరుణులు - 'వాయు' అను పదము పూర్వమందున్నను పరమందున్నను దానికి దీర్ఘము కలుగదు: అగ్ని వాయువులు, వాయ్వగ్నులు.

(17) 'అగ్ని' అను పదమునకు బరముగా 'సోమ, వరుణ' అను పదములు పరమై ద్వంద్వసమాసమగునపు డగ్నిశబ్దము తుదియచ్చునకు దీర్ఘము కలుగును: అగ్నీషోములు. (అగ్ని శబ్దమునకు బరముగావచ్చు 'స్తుత్, స్తోమ, సోమ అను పదములందలి తొలి నకారమునకు షకారమాదేశమగును); అగ్నివారుణులు.

(18) దేవతావాచక పదముల ద్వంద్వసమాసము దొలుతనుండు 'దివ్‌' శబ్దమునకు 'ద్యావా' అను నాదేశము కలుగును: ద్యావాక్షానూ, ద్యావాభూమీ.

(19) దేవతావాచక పదముల ద్వంద్వసమాసమున దొలుతనుండు 'దివ్‌' శబ్దముపై పృధివీశబ్దము చేరినచో దివ్ శబ్దమునకు 'దివస్‌' అని కాని 'ద్యావా' అని కాని యాదేశము కలుగును: దివస్పృధివీ, ద్యావాపృథివీ.

(20) దేవతాద్వంద్వసమాసమునం బూర్వపదమగు 'ఉషన్‌' శబ్దమునకు 'ఉషాసా' అను నాదేశము కలుగును: ఉషానాసూర్యము, ఉషాసానక్తా (తె.-క్త).

(21) మాతృ, పితృశబ్దముల ద్వంద్వసమాసము 'మాతాపితరౌ' (తె. మాతాపితరులు) అనియే కాక 'మాతరపితరౌ' (తె. మాతరపితరులు) అనికూడ నగును.