పుట:Andhra bhasha charitramu part 1.pdf/777

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(23) బహువ్రీహిసమాసమున 'సు, హరిత, తృణ, సోమ, అనునవి పూర్వపదములుగా గల జంభ (=ఆహారము, దంతము) శబ్దమునకు 'జంభన్‌' అను రూపము గలుగును: సుజంభా, హరితజంభా, తృణజంభా, సోమజంభా,' తెనుగున సుజంభుడు, హరితజంభుడు, తృణజంభుడు, సోమజంభుడు.

(24) కర్మవ్యతిహారార్థమున (ఒకపని పరస్పరముగ జరిగినదని తెలుపునపుడు) బహువ్రీహిసమాసమునంతమున 'ఇ(చ్)' ప్రత్యయము చేరును: కేశాకేశి, ముసలాముసలి.

(25) ద్విదండి మొదలగునవియు సరియగు బహువ్రీహిసమాసములే, ద్విదండి, ద్విముసలి, ఉభయాహస్తి మొదలయినవి.

ద్విదండి, ద్విముసలి, ఉభాంజలి, ఉభయాంజలి, ఉభాదంతి, ఉభయాదంతి, ఉభాహస్తి, ఉభయాహస్తి, ఉభాకర్ణి, ఉభయకర్ణి, ఉభాపాణి, ఉభయాపాణి, ఉభాబాము, ఉభయాబాము, ఏ-పది, ---, ఆడ్యపది (ద్వ్యాచ్యపది), సపది, నిష్కచ్యకర్ణి, సంహతపుచి, అంతెవాసి - ఇవిద్విదండ్యాదులు.

(26) ప్ర, సం, అను నుపసర్గములతో గూడి 'జాను' శబ్దమునకు 'జ్ఞు' ఆదేశమగును. ప్రజ్ఞు: = ప్రజ్ఞుడు = -----లైన జానువు గలవో వాడు; సంజ్ఞు: = సంజ్ఞుడు = సంగతములైన జానువు లెవనికి గలవో వాడు.

'ఊర్ధ్వ' శబ్దముపై నున్న 'జాను' శబ్దమునకు 'జ్ఞ' అను నాదేశము వైకల్పికముగా నగును: ఊర్ధ్వజు: = ఊర్ధ్వజ్ఞుడు = ఊర్ధ్వములైన జానువు లెవనికి గలవో వాడు, ఊర్ధ్వజాను = ఊర్ధ్వజానుడు.

(27) బహువ్రీహిసమాసము నంతమున గల 'ధనుస్‌' శబ్దము తుది వర్ణమునకు 'అనజ్‌' ఆదేశమగును: శార్ధధన్వా = శార్ధధన్వుడు.

అట్టిసమాసము సంజ్ఞావాచకమైనప్పుడు దీనికి వైకల్పికముగా నగును: శతధన్వా = శతధన్వుడు, శతధను: = శతధనుడు (-వు)

(28) బహువ్రీహిసమాసము నంతమున దలి 'జాయా' శబ్దముపై 'నిజ్‌' చేరును: 'యువతి + జాయ = యువతి: జాయ్ + ని' అనియుండగా

(29) యకారముతప్ప మఱి యేహల్లయినను పరమందుగల వ, య, లకు లోపము గలుగును: యువ జా ని --'యువతి' శబ్దమునకు బుంపద్భావముగలిగి 'యువజాని:' అనురూపము గలుగును. తెనుగున యువజాని, ఇట్లే, 'వృద్ధజాని' మొదలయినవి.