పుట:Andhra bhasha charitramu part 1.pdf/772

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మయినను నిట్టి సమాసములందు అవ్యయత్వమును బొందును: దానికి విభక్తి ప్రతిరూపకావ్యయమని పేరు.

(2) బహువ్రీహిసమాసమున స్త్రీప్రత్యయాంత పదమునకు మాఱుగ దానితో సరిపోవు పుంలింగరూప మీక్రింది సందర్భములందు వచ్చును; (i) ఆస్త్రీలింగ రూపమునకు సరిపోవు పుంలింగరూప ముండవలెను. (ii) ఆస్త్రీలింగరూపము 'ఊజ్‌' ప్రత్యయములో నంతము కాకూడదు. (iii) సమాసమున దాని తరువాత వచ్చుపదము కూడ స్త్రీలింగం దుండవలెను; (iv) ఆరెండవపదము మొదటిదానితో సమానాధికరణమం దుండవలెను; అనగా, ఆ రెండు పదములును ఏకవస్తువును బోధింపవలెను. (v) అట్లుత్తర పదముగా వచ్చినపదము (అ) పూరణార్థక సంఖ్యావాచకముగాని (ఆ) 'ప్రియ' మొదలగు పదములలో నొకటిగాని, కాకూడదు - ప్రియా, మనోజ్ఞా, కల్యాణీ, సుభగా, దుర్భగా, భక్తి, సచివా, స్వా, (స్వసా), కాంతా, క్షాంతా, సమా, చపలా, దుహితా, దామనా (సమా), తనయా, అంబా, - ఇవి ప్రియాదులు.

ఉదా. చిత్రా గావో యస్య స: = చిత్రగు: (తెనుగు: చిత్రగువు = ఎవనికి చిత్రవర్ణముగల గోవులు గలవో వాడు); దర్శనీయా భార్యా యస్య స: - దర్శనీయభార్య: = తెనుగు: దర్శనీయ భార్యుడు ఎవనిభార్య దర్శనీయయో వాడు); ఇట్లే, శ్లక్ష్ణచూడుడు, దీర్ఘజంఘుడు మొదలయినవి.

(స్త్రీ ప్రత్యయాంత పూరణార్థక సంఖ్యావాచక పదముగాని, ప్రమాణీ అను పదముగాని యంతమందుగల బహువ్రీహిసమాసము తుదను 'అప్‌' ప్రత్యయము జేరును. ఉదా. కల్యాణీ పంచమీ అసాం రాత్రీణామ్ = కల్యాణి పంచమా (రాత్రయ:) = తెనుగు: (రాత్రులు) కల్యాణీ పంచమములు. ఇచట 'పంచమీ' అను దానిపై 'అప్‌' ప్రత్యయము వచ్చి 'పంచమ' అని యైనది. ఇట్లే 'కల్యాణీ దశమా రాత్రయ: తెనుగు: (రాత్రులు) కల్యాణీ దశమములు; స్త్రీ ప్రమాణీ ఏషామ్ = స్త్రీ ప్రమాణా: (కుటుంబిన:) = తెనుగు: కుటుంబులు స్త్రీప్రమాణము.

(4) ఉత్తర పదము నదీపదము (దీర్ఘ ఈ కారాంత, ఊ కారాంత పదముగ నుండునట్టిగాని, ఋకారాంత పదముగ నుండునట్టికాని బహువ్రీహిసమాసము తుదను కప్ ప్రత్యయము చేరును: ఉదా. బహ్వ్య: కుమార్య: అస్మిన్ దేశే = బహుకుమారీకో దేశ:; ఇట్లే, బహుబ్రహ్మ బంధూకము, బహుకర్తృకము మొదలయినవి.

(5) క ప్రత్యయమునకు బూర్వమందుండు ఆ, ఈ, ఊలకు హ్రస్వము గలుగును: ఉదా. కుమారిక, కిశోరిక, బ్రహ్మబంధుక మొదలయినవి.