పుట:Andhra bhasha charitramu part 1.pdf/771

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'రాజ' శబ్దమే యున్నచో సమాసము నపుంసకలింగము కాదు: రాజసభా (తె. - భ); చంద్రగుప్త సభా (తె. -భ).

(v) 'సభా' అను పదము 'శాల, ఇల్లు' అను నర్థమునగాక 'సమూహము' అను నర్థమున దత్పురుషసమాసమున బరపదమై నపుంసకలింగమగును: ఉదా. స్త్రీసభము; కాని 'ధత్మసభా (తె. -భ); ఇచట 'సభ'కు 'ఇల్లు' అని యర్థము.

(vi) నఞ్ - సమాసములును, కర్మధారయసమాసములును గాని తత్పురుషసమాసములందు 'సేనా, నురా, ఛాయా, శాలా, నిశా' అనునవి పరపదములై వైకల్పికముగ నపుంసకలింగములగును: ఉదా. తెనుగు: బ్రాహ్మణసేన, బ్రాహ్మణసేనము, యవసుర, యవసురము; కుడ్యచ్ఛాయ, కుడ్యచ్ఛాయము; శ్వనిశ, శ్వనిశము. - రాజు 'దృడసేనుడు', ఇచట బహువ్రీహిసమాసము; ఇది అసేన, ఇచట నఞ్ - సమాసము; ఇది పరమసేన, ఇచట కర్మథారయసమాసము; కావున వీనికి నపుంసకత్వము కలుగలేదు.

IV. బహువ్రీహిసమాసము.

(1) రెండుగాని, రెంటికంటె నెక్కువగాని పదములు ప్రథమా విభక్త్యంతములైయుండ నాప్రత్యేకపదముల యర్థములకు భిన్నమగు క్రొత్త యర్థము గలది బహువ్రీహిసమాసమగును: ఉదా. ప్రాప్తముదకం (గ్రామమ్) = ప్రాప్తోదకో (గ్రామ:), తెనుగు గ్రామము ప్రాప్తోదకము = ఏ గ్రామము ఉదకముచేత పొందదగినదో అది; ఇట్లే, (ఎద్దు) ఊధరథము = ఏదిరథమునకు కట్టబడినదో (ఆ)ఎద్దు; (రుద్రుడు) ఉపహృతపశుడు = ఎవనికి పశువుపహారముగా నివ్వబడినదో వాడు; (స్థాలి) ఉద్ధృతౌదన = దేనియందు అన్న ముంచబడినదో అది (స్థాలి); (హరి) పీతాంబరుడు = ఎవనికి పీతవర్ణము గల వస్త్రముగలదో యతడు = హరి; (గ్రామము) వీరపురుషకము = దేనియందు వీరపురుషులుందురో అది (గ్రామము).

ప్రాదులకంటె జేరిన ధాతుజ పదములతో గూడినపదము బహువ్రీహి సమాసమున జేరినచో నాప్రాదులపై నున్న పదములకు వైకల్పికముగా లోపము కలుగును: ఉదా. (ఈ వృక్షము) ప్రపతితవర్ణము: లేక 'ప్రవర్ణము'.

నఞ్‌తో జేరిన యన్త్యర్థక పదములు బహువ్రీహిసమాసమున జేరునపుడు దానికి వైకల్పికముగ లోపముగలుగును: ఉదా. అవిద్యమాన సుతుడు, లేక అపుత్రుడు (ఎవనికి పుత్రులులేరో వాడు); ఇట్లే, 'అభా

'అస్తిక్షీర' మొదలగునవి బహువ్రీహి సమాసములు. (ఈబ్రాహ్మణి) అసిక్షీర = ఎవతెయొద్ద పాలుగలవో యామె 'అస్తి' యనునది క్రియాపద