పుట:Andhra bhasha charitramu part 1.pdf/770

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉదా. షోడన్ ---, షోడుడు = ఆఱుదంతములు గలవాడు; షోడశ; షోడా = తెనుగు షోడము = ఆఱువిధములు.

సమాసముల లింగము.

(1) ద్వంద్వ తత్పురుషసమాసములు పరపదముయొక్క లింగమును గలిగియుండును: ఇవి కుక్కుటమయూరులు; ఇవి మయూరీ కుక్కుటములు.

(2) 'అశ్వము + వడవా' అను పదములు సమసించునపు డా సమాసలింగము పూర్వపదము లింగమును గలిగియుండును: ఇవి యశ్వవడవములు ('వడనా' శబ్దమాకారాంత స్త్రీలింగమయినను సమాసమున దానికి పుంలింగము కలిగినది).

(3) సంస్కృతసమాసములు అనంతములగునపుడు పుంలింగములయినను నపుంసకలింగములయినను తెనుగున వాని మహదమహత్త్వము ననుసరించియే ప్రత్యయములు చేరుచుండును.

(4) నఞ్ - తత్పురుష సమాసములును, కర్మధారయసమాసములును దప్ప దక్కిన తత్పురుషసమాసము లీ క్రింది సందర్భములందు నపుంసక లింగములగును:-

(i) 'కంథా' శబ్దము ఉశీనరదేశములోని పట్టణము అను నర్థమున సంజ్ఞావాచకమై తత్పురుషసమాసమున బరపదముగాజేరి నపుంసకలింగ మగును: ఉదా. సౌశమికంథము, సంజ్ఞావాచకము కానప్పుడు 'వీరణకంథా = తెనుగు = వీరణకంథ'; ఉశీనరదేశములోని పట్టణము కానప్పుడు 'దాక్షికంథా = (తెనుగు) దాక్షికంథ.'

(ii) 'ఉపజ్ఞాఅ, ఉపక్రమ' అను పదములు 'క్రొత్తగా కనిపెట్టబడిన, ఆరంభింపబడిన' అను నర్థములందు తత్పురుషసమాసముల బరపదములుగా జేరి నపుంసకలింగములగును: ఈ గ్రంథము పాణిన్యుపజ్ఞము; ఈ ద్రోణము (కొలతపాత్ర) నందోపక్రమము (నందుడనురాజు తొలుత నేర్పఱిచినది).

(iii) 'ఛాయా' శబ్దము ఎక్కువగానున్న వస్తువులఛాయ అను నర్థమున తత్పురుషసమాసమున బరపదమై నపుంసకలింగమగును: ఇక్షుచ్ఛాయము.

(iv) 'రాజు' అను నర్థముగల పదముగాని, మనుష్యేతరుల పేళ్లుగాని, పూర్వమందు గల '--' శబ్దము తత్పురుషసమాసమున నపుంసకలింగమగును: ఉదా. ఇనసభము, ఈశ్వరసభము, రక్షస్సభము, పిశాచసభము. 'రాజు' అను నర్థముగల యితరపదము ఉన్నప్పుడే యీ విధి వర్తించునుగాని