పుట:Andhra bhasha charitramu part 1.pdf/77

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సదాసిరీ, సాదవాహన, కన్హ, మమ్మా, భవగోప, బొపకి, దామచిక, పులుమాఇ, ధణమ, సాతకణి, విణ్హుదత, క్షహరాత, క్షతప, సహపాన, దీనీక, ఉషవదాత, గోతమిపుత, సదకణి, విణ్హుపాలిత, అవరకఖడి, సివగుత, మిధున, పుళుమవి, సవస.

ఈక్రింది సంఘముల పేర్లు కానవచ్చుచున్నవి.

ఉత్తమభాద్ర (యోధులసంఘము); (తేకిరసి, ఒక యతులసంఘము); భదాయనీయ (భిక్షుసంఘము); చతిక (ఒక భిక్షుసంఘము); కులరికశ్రేణి (ఒక యంత్రికశ్రేణి,) తిలసిషకశ్రేణి, (వృత్తులకు సంబంధించిన సంఘములు.)

పర్వతములు

తిరణ్హు, గోవధన,

నదులపేళ్లు.

బాణ్ణసా, ఇబా, పారదా, దమణ, తాసీ, కరభేణా, దహనుకా,

పైదానినిబట్టి యాంధ్రరాజుల శాసనములభాష పాలిభాషకు మిక్కిలి దగ్గఱగనున్నట్లు దెలిసికొన వచ్చును. నాసిక యందేకాక నేటి యాంధ్రదేశమున గానవచ్చిన యాంధ్రరాజుల ప్రాకృత శాసనముల భాషయు బైదానినే పోలియుండును. ఆంధ్రదేశమున నశోకుని శాసనములు మొన్నటి వఱకును దొరకలేదు. అనంతపురము జిల్లాలోని గుత్తి కేడుమైళ్ల దూరముననున్న యెఱ్ఱగుడి గ్రామమునకు సమీపమున చిన్నగుట్టలపై చెక్కబడియున్న యశోకుని పదునాలుగు శిలాశాసనములను నేను స్వయముగ ప్రధమమున గనిగొని వాని ప్రతులనెత్తి చదివితిని. అందలి రెండు శాసనముల నీక్రింద నుదాహరించుచున్నాను.

ఏడవ శిలాశాసనము.

1. దేవానంపియే పియదసినే లాజా పవతా ఇఛతి.

(దేవానాంప్రియ: ప్రియదర్శీ రాజా సర్వత్ర ఇచ్ఛతి.)