పుట:Andhra bhasha charitramu part 1.pdf/768

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(8) కర్మధారయసమాసము సంఖ్యాదియై పరమందున్న 'అహర్‌' శబ్దముతో నమాహారార్థమును బొందినచో 'అహర్‌' అనుపదమునకు అహ్నాదేశము కలుగదు: ఉదా. ద్వ్యహా--, త్ర్యహము.

(9) పుణ్య, ఏక, పదములకు బరమైన 'అహర్‌' పదమునకును అహ్నాదేశము గలుగదు: పుణ్యాహము, ఏకాహము.

(10) తనజాతియందు శ్రేష్ఠము అనునర్థమున 'ఉరస్‌' శబ్దము తత్పురుషసమాసమున బరపదముగా నున్నచో దానిపై 'టచ్‌' ప్రత్యయము వచ్చును: ఉదా. అశ్వోరసము = అశ్వజాతిలో శ్రేష్ఠమైనది.

(11) జాతినిగాని, సంజ్ఞనుగాని తెలుపు దత్పురుషసమాసమున బరపదములుగానుండు అనన్, అశ్మన్, అయన్, సరన్, అనువానిపై 'టచ్‌' ప్రత్యయము చేరును: ఉదా. ఉపానసము, అమృతాశ్మము, కాలాయసము, మండూక్స్నరసము; ఇవి జాతివాచక సమాసములు. మహానసము, పిండాశ్మము, లోహితాయసము, జలసరనము. - ఇవి సంజ్ఞావాచక సమాసములు.

(12) గ్రామ, కౌట, అనుపదములు పూర్వపదములుగను, తక్షన్ అను పదము పరముగను గల తత్పురుషసమాసమున తక్షన్ శబ్దమునకు టచ్ ప్రత్యయము చేరును: ఉదా> గ్రామతక్షుడు,కౌటతక్షుడు.

(13) అతి పూర్వమగు శ్వర్ శబ్దముతో జేరిన తత్పురుషసమాసముతుదను టచ్ ప్రత్యయము చేరును: ఉదా. ఈ వరాహము అతిశ్వము = కుక్కకంటె వేగముగా పరుగెత్తునది.

(14) ప్రాణినిగాక యితరవస్తువును దెలుపు పదముతో నుపమానమును దెలుపు శ్వన్ శబ్దము తత్పురుష సమాసమున బరపదమగునపుడు దానిపై 'టచ్‌' ప్రత్యయము చేరును: ఉదా. ఆకర్షశ్వము = కుక్కను పోలిన విల్లు.

(15) ఉత్తర, మృగ, పూర్వ అను పదములు పూర్వమందుగల సక్థిన్ శబ్దముతో గలిసిన తత్పురుషసమాసము తుదను టచ్ ప్రత్యయముచేరును: ఉదా. ఉత్తర సక్థము, మృగసక్థము, పూర్వసక్థము.

(16) ద్విగుసమాసమున నుత్తరపదముగానున్న 'నౌ' శబ్దమునకు టచ్ ప్రత్యయము చేరును; తద్ధితప్రత్యయము లోపించినచో జేరదు: ఉదా. ద్వినావరూప్యుడు = రెందు నావలతో వచ్చినవాడు; పంచనావ ప్రియుడు; ద్వినావము, త్రానావము మొదలైనవి.

(17) అర్ధశబ్దముకంటె బరమైన శబ్దమునకు 'టచ్‌' ప్రత్యయము చేరును: అర్దనావము.