పుట:Andhra bhasha charitramu part 1.pdf/767

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2) ఉపపదము 'అమ్‌' అంతమందుగల యవ్యయములతోడనే సమసించును: ఉదా. స్వాదుంకారముగ దినుచున్నాడు = అన్నమును తీయగా జేసికొని తినుచున్నాడు; లవణంకారముగ దినుచున్నాడు = అన్నములో ఉప్పుకలుపుకొని తినుచున్నాడు.

(3) తృతీయావిభక్త్యంతమగు నుపపదము 'అమ్‌' అంతమందుగల యవ్యయముతో వైకల్పికముగ సమసించును: ఉదా. మూలకోప దంశముగ దినుచున్నాడు = అన్నముతో కందమూలమునుజేర్చి తినుచున్నాడు.

(4) సంఖ్యావాచకముగాని, యవ్యయముగాని పూర్వమందుండి, 'అంగులీ' పదము పదమందువచ్చు తత్పురుష సమాసమునకు 'అచ్‌' ప్రత్యయము చేరును: ఉదా. ఈ కట్టె త్ర్యంగులము, నిరంగులము, అత్యంగులము మొదలయినవి.

(5) అహన్, నర్వ, అనుపదములుగాని, రాత్రియందలి భాగములను దెలుపు పదములుగాని, సంఖ్యాత, పుణ్య, అను పదములుగాని, సంఖ్యావాచకముగాని, యవ్యయముగాని పూర్వమందుగల 'రాత్రి' శబ్దమునకు 'అచ్‌' ప్రత్యయము చేరును: ఉదా. అహోరాత్రము, సర్వరాత్రము, పూర్వరాత్రము, సంఖ్యాతరాత్రము, పుణ్యరాత్రము, ద్విరాత్రము, అతిరాత్రము మొదలయినవి.

(6) రాజన్, అహన్, సఖి, అనుపదములు తత్పురుష సమాసమున బరపదములుగా నున్నయెడల వానిపై 'టచ్‌' ప్రత్యయము వచ్చును: ఉదా. పరమరాజుడు, సప్తాహము, కృస్ఃనసఖుడు మొదలయినవి.

(7) నర్వ, సంఖ్యాత అనుపదములును, పగటియందలి భాగములను దెలుపు పదములును, సంఖ్యావాచక పదములును, అవ్యయములును పూర్వపదములుగానుండి, 'అహన్‌' అనుపదము పరమందుండి తత్పురుషసమాసమగునపుడు 'అహన్‌' కు 'అహ్న' అని యాదేశమగును: ఉదా. నర్వాహ్ణము, సంఖ్యాతాన్నము; పూర్వాహ్ణము, మధ్యాహ్నము, ఏకాహ్నము, ద్వ్యహ్నము, త్ర్యహ్ణము, అత్యహ్నము, నిరహ్నము మొదలయినవి.

అదంతమై నకారములు అకారముగా మార్పగల యక్షరముగల పదము పూర్వమం దున్నయెడల 'అహర్‌' అనుపదమందలి నకారము ణకారముగా మాఱును: పూర్వాహ్ణము మొదలయినవి. నిరహ్నము, దురహ్నము, అనుదానియందు పూర్వపద మదంతముకావున 'ణ' కారము కలుగలేదు.